Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: మన్యం వీరుడు
By: Tupaki Desk | 30 Dec 2018 12:09 PM ISTఆంగ్లేయుల పాలనపై తిరుగుబాటు చేసిన అలుపెరగని యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన కథను పెద్దలు గొప్పగా చెబుతుంటారు. అడవుల్లో ఉంటూ గెరిల్లా పోరాటం చేసిన వీరాధివీరుడు. తుపాకులకు ఎదురెళ్లి బాణాలు సంధించిన వీరాధివీరుడు. కేడీ పేట-నర్సీపట్నం ఏరియాలో ఆయన సంచరించేవారు. దట్టమైన అడవుల్లో ఎవరికీ చిక్కకుండా స్థావరం ఏర్పరుచుకుని మరీ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు అల్లూరి. అందుకే ఆ మహానుభావుడి చరిత్రకు అంత విలువ ఉంది.
అదే పాయింట్ తో సూపర్ స్టార్ కృష్ణ `అల్లూరి సీతారామరాజు` అనే సినిమా తీసి పెద్ద సక్సెసయ్యారు. నాటికి, నేటికి అల్లూరి అనగానే ఆయన పేరే గుర్తుకొస్తుంది అభిమానులకు. మన్యం వీరుడిగా కృష్ణ ఉగ్రరూపాన్ని తలుచుకుంటారు. అల్లూరికి ఆయనను తప్ప వేరొకరిని ఊహించుకోలేరు. అయితే అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని ఎందరో స్టార్లు తమ సినిమాల్లో అల్లూరిని అతిధిగా చూపించి ఆ పాత్రలో తామే నటించి మెప్పించారు. ఆ కోవలోనే అల్లూరి స్ఫూర్తిని తన ఒంట్లోకి ఇంకించుకుని మరీ సీనియర్ ఎన్టీఆర్ రౌద్రరసం ఆవిష్కరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లోనూ ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్ తో అలరించనున్నారు.
తాజాగా `ఎన్టీఆర్ బయోపిక్` నుంచి రివీల్ చేసిన అల్లూరి సీతారామరాజు లుక్ లో బాలకృష్ణ ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారు. మన్యం వీరుడికి మారు రూపంలా ఆయన అలరిస్తున్నారు. సింహా అల్లూరి గెటప్ అభిమానులకు బిగ్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ లుక్ కోసం క్రిష్ ఎంత శ్రద్ధ తీసుకున్నారో, ఎంత జాగ్రత్త తీసుకున్నారో పోస్టర్ చూసి చెప్పేయొచ్చు. బాలకృష్ణ పై అపారమైన ప్రేమాభిమానాలు, భక్తితో క్రిష్ సినిమాని గొప్పగా చిత్రీకరిస్తున్నారని అర్థమవుతోంది. మన్యం వీరుడి గెటప్ కి బాలయ్య అద్భుతంగా సూటయ్యారు. ఆ రౌద్రరసాన్ని ఆహార్యంలో ఏమేరకు ప్రదర్శిస్తారో చూడాలి. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లన్నిటినీ గంపగుత్తగా ఓ చోట చేరిస్తే బయోపిక్ (`కథానాయకుడు`, `మహానాయకుడు`) గ్యాలరీ ఓ అద్భుతమైన క్యారికేచర్ -ఆర్ట్ మ్యూజియంలా తయారవుతుందేమో?