Begin typing your search above and press return to search.

మళ్ళీ సింహావతారం ఎత్తిన బాలయ్య

By:  Tupaki Desk   |   23 Oct 2017 5:50 PM IST
మళ్ళీ సింహావతారం ఎత్తిన బాలయ్య
X
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ మొదటి నుంచి అదే ఎనర్జీతో వస్తున్న బాలయ్య వయసు మీద పడుతున్నా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా అదే ఊపుతో అదే ఎనర్జీతో టాలీవుడ్ నట సింహంగా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా డ్యాన్సుల్లో బాలయ్య స్టామినా నేటి తరం కుర్ర హీరోలకు పోటీగా ఉంటుందని చెప్పాలి.

ఈ ఏడాది మొదట్లో తన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమాతో డిజాస్టర్ ని అందుకున్నాడు. అయితే ఈ సారి మళ్లీ ఎలాగైనా హిట్ కొట్టాలని తన గత సెంటి మెంట్ తో కూడిన టైటిల్ ని ఎంచుకున్నాడు. గతంలో బాలయ్య సినిమాలకు ఎక్కువగా సింహా అనే పేరు వినిపించేది. సమరసింహా రెడ్డి - నరసింహ నాయుడు అలాగే సింహ చిత్రాలు పెద్ద హిట్స్ గా నిలిచాయి. అందుకే మళ్ళీ అదే అవతారం ఎత్తనున్నారని చాలాకాలం నుండి వింటున్నాం.

ఇప్పుడు అదే తరహాలో తన నెక్స్ట్ సినిమాకు జై సింహ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు బాలకృష్ణ. కోలీవుడ్ దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సింహా అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఇష్ట ప్రకారంగానే బాలయ్య ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య తో మూడవసారి నయన తార నటిస్తోంది. అలాగే నటాష దోషి - హరి ప్రియలు కూడా నటిస్తున్నారు. 2018 సంక్రాతి కి ఈ సినిమా రిలీజ్ కానుంది.