Begin typing your search above and press return to search.

ఇది 'బలగం' స్థాయి.. కొన్ని గంటల్లోనే టాప్‌ 10

By:  Tupaki Desk   |   25 March 2023 9:30 PM IST
ఇది బలగం స్థాయి.. కొన్ని గంటల్లోనే టాప్‌ 10
X
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్య పాత్రలో నటించిన 'బలగం' చిత్రం విడుదలకు ముందు మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేక పోయింది. దిల్ రాజు నిర్మించిన సినిమా అవ్వడం వల్ల కాస్త ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది.. కానీ ఎంత వరకు ఈ సినిమా వసూళ్లు రాబడుతుంది అనేది ఆ సమయంలో ఎవరూ ఊహించలేక పోయారు.

రిలీజ్ అయిన మొదటి రోజే సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో చేస్తారా అన్నట్లుగా చాలా సహజమైన పాత్రలతో కథ మరియు కథనంతో రూపొందింది. బలగం సినిమా చిన్న సినిమానే అయినా కూడా కలెక్షన్స్ విషయంలో.. టాక్‌ విషయంలో పెద్ద సినిమాగా నిలిచింది.

భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన సినిమాలు సైతం దక్కించుకోలేక పోయిన కలెక్షన్స్ ని 'బలగం' సినిమా దక్కించుకుంది. దిల్ రాజు పెట్టిన పెట్టుబడికి చాలా రెట్ల లాభాలు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఒకవైపు థియేటర్ లలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న బలగం సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమైంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన కొన్ని గంటల్లోనే బలగం చిత్రం ఇండియన్‌ టాప్ 10 లో ట్రెండ్ అయింది. 5వ స్థానంలో 'బలగం' చిత్రం నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిన బలగం చిత్రం కుటుంబ విలువలను కలిగి ఉన్న చిత్రంగా... ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం అంటూ ప్రేక్షకులు స్వయంగా పబ్లిసిటీ చేయడంతో థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ముందు ముందు మరింతగా ఈ చిత్రం ఓటీటిలో భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాన్ని ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్‌ గా ఎన్నో సినిమాల్లో నటించిన వేణు యెల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూ విభిన్నమైన పాత్రలతో దర్శకుడు వేణు అల్లిన కథనం ఎవర్గ్రీన్ అన్నట్లుగా నిలిచి పోయింది. అందుకే బలగం సినిమా ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్ట్రీమింగ్‌ అయిన తక్కువ సమయంలోనే టాప్ 10 లో నిలవడంతో ఇది బలగం స్థాయి అన్నట్లుగా ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. తెలుగు తో పాటు ఈ సినిమా పలు భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.