Begin typing your search above and press return to search.

మళ్లీ హీరో అవుతున్న అందాల నటుడు

By:  Tupaki Desk   |   17 Oct 2015 5:00 PM IST
మళ్లీ హీరో అవుతున్న అందాల నటుడు
X
రోజా - దళపతి - ముంబయి వంటి సినిమాలతో అందాల హీరోగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. ఆ పాత్రల్లోనూ ఆయన ఒదిగిపోయారు. రీసెంటుగా తనీ ఒరువన్ సినిమాతో విలన్ గానూ మెప్పించారాయన. ఈ సినిమాతో అరవింద్ స్వామి మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, ప్రస్తుతం విలన్ గా కెరీర్ ఎంజాయ్ చేస్తున్న అరవింద్ స్వామి మరోసారి హీరోగా కనిపించబోతున్నారట. తమిళంలో వైరైటీ సినిమాలు చేసే దర్శకుడిగా పేరున్న బాల దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శశికుమార్ - వరలక్ష్మీల కాంబినేషన్ లో 'తారై తప్పట్టై' సినిమా చేస్తున్న బాల - అది పూర్తయిన తరువాత అరవింద్ స్వామి లీడ్ రోల్ లో సినిమా తెరకెక్కించబోతున్నారు.

అయితే.. బాల సినిమాలంటే ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. పేరుకే అందులో హీరో ఉన్నా మామూలు సినిమాల్లో హీరో లుక్కే ఉండదు. డీగ్లామర్ రోల్స్ చేయిస్తారు బాల. ఆయన తీసిన పితామగన్ - వాడువీడు - నేను దేవుడిని వంటి సినిమాలను గుర్తుచేసుకుంటే బాల హీరోలు ఎలా ఉంటారో తెలిసిపోతుంది. దీంతో బాల - అరవింద్ స్వామిల కాంబినేషన్ లో సినిమా అనగానే అరవింద్ అభిమానులు జడుసుకుంటున్నారట. బాల దెబ్బకు ఈ అందాల నటుడిని ఎంత చండాలంగా చూడాలో అనుకుంటున్నారు.