Begin typing your search above and press return to search.

బాలయ్య 'ఇంద్ర' టైప్‌ సినిమానా?

By:  Tupaki Desk   |   8 Feb 2020 3:30 PM GMT
బాలయ్య ఇంద్ర టైప్‌ సినిమానా?
X
సింహా.. లెజెండ్‌ చిత్రాలతో బాలకృష్ణ బోయపాటిల కాంబో సూపర్‌ హిట్స్‌ ను అందుకున్న విషయం తెల్సిందే. వీరి కాంబోలో మూడవ చిత్రం రాబోతుండటంతో ఖచ్చితం గా అది హిట్‌ అయ్యి హ్యాట్రిక్‌ ఈ జోడీకి హ్యాట్రిక్‌ దక్కడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా బోయపాటి ఈ చిత్రంకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో బిజీగా ఉన్నాడు. వినయ విధేయ రామ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ సినిమా కు బోయపాటి డబుల్‌ శ్రద్ద తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రంను ఈనెల 26 నుండి వారణాసిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా మెగాస్టార్‌ చిరంజీవి సెన్షేషనల్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘ఇంద్ర’. ఆ సినిమాలో చిరంజీవి వారణాసిలో ఎంట్రీ ఇస్తాడు. వారణాసి అందాలను చూపించడంతో పాటు కథ మొదటి పార్ట్‌ ఎక్కువగా అక్కడే సాగుతుంది. అందుకే వారణాసి అనగానే ఇంద్ర సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు బాలయ్య బోయపాటిల చిత్రం మెజార్టీ పార్ట్‌ ను వారణాసి లో చిత్రీకరించబోతున్నట్లుగా చెబుతున్నారు.

వారణాసిలో బాలకృష్ణ అఘోరా గెటప్‌ లో కనిపిస్తాడని.. ఆయనకు చాలా పెద్ద ఫ్ల్యాష్‌ బ్యాక్‌ ఉంటుందని సినిమా గురించి నెటిజన్స్‌ స్టోరీ అల్లేస్తున్నారు. వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ మరియు భారీ యాక్షన్‌ ఫ్ల్యాష్‌ బ్యాక్‌ అంటే ఇది పూర్తిగా ఇంద్ర సినిమా టైప్‌ లో ఉండబోతున్నట్లుందిగా అంటూ అప్పుడే కామెంట్స్‌ వస్తున్నాయి. ఇంద్ర టైప్‌ లో ఉన్నా పర్వాలేదు కాని సినిమా మాత్రం సూపర్‌ హిట్‌ గా ఉండాలంటూ నందమూరి అభిమానులు అంటున్నారు. బాలయ్య సక్సెస్‌ కొట్టక చాలా కాలం అయ్యింది. అందుకే ఫ్యాన్స్‌ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదే ఏడాది దసరా వరకు బోయపాటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా నయనతార.. కేథరిన్‌ లు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.