Begin typing your search above and press return to search.

అఖండ ట్రైల‌ర్‌: బ్రేకుల్లేని బుల్డోజ‌ర్ ని కొడ‌కా..!

By:  Tupaki Desk   |   14 Nov 2021 1:43 PM GMT
అఖండ ట్రైల‌ర్‌: బ్రేకుల్లేని బుల్డోజ‌ర్ ని కొడ‌కా..!
X
బోయ‌పాటి ఏదో చేస్తున్నాడు. మునుప‌టి కంటే ఇంకేదో కొత్త‌గా స‌రికొత్త‌గా ఏదైనా చూపించాల‌నే తాప‌త్ర‌యం అతడిలో క‌నిపిస్తోంది. ఎప్ప‌టిలానే క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని ఎంత‌మాత్రం త‌గ్గ‌కుండా ధీటుగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డే భీక‌ర‌మైన పాత్ర‌ల‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌బోతున్నాడు. అందుకు ఇదిగో అఖండ ట్రైల‌ర్ ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. బోయ‌పాటి అంటేనే మాస్ .. అభిమానులు ఊహించే మాస్ యాక్ష‌న్ కంటెంట్ ఎంత‌మాత్రం త‌గ్గదని ఈ విజువల్స్ భ‌రోసాని ఇస్తున్నాయి. ఇది సింహాని మించి లెజెండ్ ని మించిన తోపు అని ఈ విజువ‌ల్స్ చూశాక అంగీక‌రించాల్సిందే. ట్రైల‌ర్ కే ఇలా అంటే ఇక పూర్తి సినిమాలో ప్ర‌తిక్ష‌ణం గ‌గుర్పొడిచే యాక్ష‌న్ పంచ్ ల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.

బాల‌య్య‌లో అదే వాడి వేడి. సింహంలా కంటి చూపుతోనే శాసిస్తున్నాడు. పంచ్ ప‌వ‌ర్ తో వేడెక్కిస్తున్నాడు. అత‌డికి ఎదురొస్తే బుల్డోజ‌ర్ వ‌చ్చి గుద్దిన‌ట్టే అన‌డానికి అత‌డి గెట‌ప్ లు బిగ్ ప్రూఫ్. దీనిని బ‌ట్టి ఈసారి న‌ట‌సింహాన్ని బోయ‌పాటి ఏ రేంజులో ఆవిష్క‌రిస్తున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. బాల‌య్య‌- బోయ‌పాటి హ్యాట్రిక్ కాంబినేష‌న్ నుంచి ఆశించిన మ‌సాలా అభిమానుల‌కు థియేట‌ర్ల‌లో దొరుకుతుంద‌న‌డానికి ఈ ట్రైల‌ర్ ఒక సాక్షీభూతం. ఇక ఈ చిత్రంలో అఘోరా పాత్ర ఎవ‌రూ ఊహించ‌నంత సంచ‌ల‌నంగా ఉంటుంద‌ని ట్రైల‌ర్ లో చూపించారు. ప్ర‌తి ఫ్రేమ్ లో అల్లాడించే కంటెంట్ ని ఏర్చి కూర్చార‌ని తాజా ట్రైల‌ర్ నిరూపించింది.

విధికి విధాత‌కి విశ్వాసానికి స‌వాళ్లు విసర‌కూడ‌దు! అనే డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. ``అంచ‌నా వేయ‌డానికి పోల‌వ‌రం డ్యామా ప‌ట్టి సీమ తూమా .. పిల్ల కాలువ‌`` అంటూ బాల‌య్య పొలిటిక‌ల్ పంచ్ తో ఎంట్రీ అదుర్స్. ఇక ఈ చిత్రంలో బాల‌య్య ఓవైపు .. శ‌తాధిక చిత్రాల‌ శ్రీ‌కాంత్ మ‌రోవైపు.. ర‌గ్గ్ డ్ మాస్ జ‌గ‌ప‌తి ఇంకో వైపు అద‌ర‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శ్రీ‌కాంత్ ఊర‌మాస్ గెట‌ప్ రౌడీయిజం మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తున్నారు బోయ‌పాటి. ఈ సినిమాతో అత‌డికి స‌రికొత్త ఇమేజ్ ని ఆపాదిస్తున్నారు.

క‌ళ్లు తెరిచి జూలు విదిలిస్తే.. అంటూ జ‌గ‌ప‌తి ర‌గ్గ్ డ్ గెట‌ప్ కూడా ఆద్యంతం ఆస‌క్తిని పెంచుతోంది. ``ఒక మాట నువ్వు అంటే అది శ‌బ్ధం.. అదే మాట నేనంటే శాస‌నం.. దైవ శాస‌నం..``.. `ఒక‌సారి డిసైడై బ‌రిలో దిగితే బ్రేకుల్లేని బుల్డోజ‌ర్ ని.. తొక్కి పార‌దొబ్బ‌తా లెఫ్టా రైటా టాపా బాట‌మా.. కొడ‌కా ఇంచు బాడీ దొర‌క‌దు.. !! అంటూ పిచ్చెక్కించే పంచ్ ల‌తో అద‌ర‌గొట్టాడు. ఇక అఘోరా పాత్ర డైలాగుల్లోనూ పంచ్ ల‌కు కొద‌వేమీ ఉండ‌దు. ``నీకు స‌మ‌స్య వ‌స్తే దండం పెడ‌తారు. మేము ఆ స‌మ‌స్య‌కే పిండం పెడ‌తాం.. బోత్ ఆర్ సేమ్.. అంటూ బాల‌య్య పంచ్ లు అద‌ర‌హో అనాలి. అయితే ట్రైల‌ర్ ఆద్యంతం భారీ మాస్ యాక్ష‌న్ ని మాత్ర‌మే హైలైట్ గా ఆవిష్క‌రించారు. ప్ర‌గ్య జైశ్వాల్ ని ఛ‌మ‌క్కులా చూపించి వ‌దిలేసారు. రొమాన్స్ ని మించి క‌థ కంటెంట్ పై బోయ‌పాటి బాగా వ‌ర్క‌వుట్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. మొత్తానికి అఖండ ట్రైల‌ర్ మ‌సాలా కంటెంట్ తో ర‌క్తి క‌ట్టిస్తోంది. బాల‌య్య అభిమానుల్లో అమాంతం అంచ‌నాలు పెంచే ట్రైల‌ర్ ఇది. ఇక ఈ సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ద్వార‌కా క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. విజువ‌ల్ రిచ్ కంటెంట్ కోసం స‌ద‌రు బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్ ని కుమ్మ‌రించింద‌ని అర్థ‌మ‌వుతోంది.