Begin typing your search above and press return to search.

తిట్టిపోసుకుంటున్న కోలీవుడ్ గ్రేట్ డైరెక్టర్స్

By:  Tupaki Desk   |   10 April 2016 3:30 PM GMT
తిట్టిపోసుకుంటున్న కోలీవుడ్ గ్రేట్ డైరెక్టర్స్
X
భారతీరాజా.. పరిచయం అక్కర్లేని పేరు. తమిళం వరకే కాదు.. మొత్తంగా సౌత్ ఇండియాలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడు. ఇక బాల ఈ తరం డైరెక్టర్లో చాలా గొప్ప పేరు సంపాదించాడు. ఈ ఇద్దరు లెజెండరీ డైరెక్టర్ల మధ్య వివాదం.. మాటల యుద్ధం కోలీవుడ్ ను నివ్వెర పరుస్తోంది. ఓ కథ విషయంలో వీరి మధ్య తలెత్తిన గొడవ రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకునే స్థాయికి వివాదం ముదిరింది. ఇంతకీ మేటర్ ఏంటంటే..

‘కుట్ర పరంపరై’ అనే పేరుతో భారతీరాజా ఇంతకుముందు ఓ సినిమా మొదలుపెట్టాడు. కానీ ముందుకు తీసుకెళ్లలేదు. ఐతే తాజాగా బాల కూడా ఇదే పేరుతో సినిమా మొదలుపెట్టాడు. ఆర్య.. రానాతో పాటుగా ఐదుగురు హీరోలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. తమిళంలో ఓ గొప్ప నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఐతే తాను కూడా అదే కథతో సినిమా తీయాలనుకుంటే.. ఇప్పుడు బాల వచ్చి తన ప్రయత్నానికి అడ్డుపడుతున్నాడని భారతీరాజా ముందుగా విమర్శలు గుప్పించాడు. తన ఎంగిలిని బాల తినడని భావిస్తున్నాడని భారతీరాజా వ్యాఖ్యానించడంతో వివాదం పెద్దదైంది.

భారతీ రాజా వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు బాల. భారతీరాజాకు, తనకు పోరాటం వల్ల ఈ భూమికి ఒరిగేదేమీలేదని.. ఐతే తన కథకు.. భారతీరాజా చేయాలనుకున్న కథకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం ఆయన తెలుసుకోవాలని బాల అన్నాడు. భారతీరాజా చేసిన ‘ఎంగిలి’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇవి పిల్లల మనస్తత్వాన్ని గుర్తుకు తెస్తున్నాయని.. వయసు మీద పడుతున్న కొద్దీ కొందరు చిన్న పిల్లల్లా తయారవుతారంటారని ఎద్దేవా చేశాడు బాల. భారతీరాజా వ్యాఖ్యలు తన మనసును గాయపరిచాయని.. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించాలన్నది తన అభిమతం కాదని.. ఐతే కొన్ని నిజాల్ని బటయపెట్టాల్సి అవసరం ఉంది కాబట్టే ప్రెస్ మీట్ పెట్టానని బాల అన్నాడు.