Begin typing your search above and press return to search.

బాజీరావ్‌ బాహుబలిని ఢీ కొడతాడా?

By:  Tupaki Desk   |   15 July 2015 3:44 AM GMT
బాజీరావ్‌ బాహుబలిని ఢీ కొడతాడా?
X
బాలీవుడ్‌ బాబులకు కూడా మతిపోగొట్టేసిన మూవీ అంటే ''బాహుబలి'' మాత్రమే. నాలుగు రోజుల్లో 200 కోట్ల గ్రాస్‌ క్లబ్‌లోకి దూసుకుపోయిన సినిమా ఇది. అయితే బాలీవుడ్‌లో ఈ సినిమాను ఢీకొట్టే మరో సినిమా ఏదైనా వస్తోందా? నిజానికి బాలీవుడ్‌లో వార్‌ సినిమాలు తీసే సత్తా ఇప్పుడున్న దర్శకులకు ఎవ్వరికీ లేదు. కాని ఎమోషనల్‌ కంటెంట్‌తో బాహుబలి సంగతేంటో చూస్తా అంటున్నారు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలి.

త్వరలోనే ''బాజీరావ్‌ మస్తానీ'' అనే సినిమాతో రానున్నాను ఈ దర్శకుడ. బాజీరావ్‌ అనే ఓ మరాఠి రాజు.. ఆయన మొదటిభార్య, రెండవ భార్య మస్తానీలకు చెందిన కథ ఇది. మారాజుగా రణవీర్‌ సింగ్‌, మొదటి భార్యగా ప్రియాంక చోప్రా, మస్తానీగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను చూస్తుంటే దీనిని కూడా ఒక వార్‌ సినిమాలాగే తీశారేమో అని సందేహం రాక మానదు. డిసెంబర్‌ 18న వస్తున్న ఈ సినిమా తాలూకు టీజర్‌ను ఈరోజే విడుదల చేసే ఛాన్సుంది. మరి బాహుబలిని చాలెంజ్‌ చేయడానికి బాజీరావ్‌ సత్తా సరిపోతుందా? ఆ రేంజు విజువల్‌ వండర్‌ భన్సాలీ మళ్ళీ క్రియేట్‌ చేయగలుగుతాడా? చూద్దాం.