Begin typing your search above and press return to search.

మరో ఎపిక్‌ సినిమా వచ్చేస్తోందంతే...

By:  Tupaki Desk   |   15 July 2015 5:01 PM GMT
మరో ఎపిక్‌ సినిమా వచ్చేస్తోందంతే...
X
సంజయ్‌ లీలా భన్సాలీ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు అంటే అది భారీ కాన్వాసులో ఉంటుందని అందరికీ తెలిసిందే. జోధా అక్బర్‌, రామ్‌ లీలా వంటి చిత్రాల్ని ఆ స్థాయిలోనే తీశాడు. ఇప్పుడు అతడి టార్గెట్‌ భాజీరావు మస్తానీ. రణవీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొన్‌ నాయకానాయికలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో భాజీరావు పాత్రలో రణవీర్‌ నటిస్తున్నాడు. అతడికి మొదటి భార్య కాశీబాయి పాత్రలో ప్రియాంక చోప్రా, రెండోభార్య మస్తానీ పాత్రలో దీపిక పదుకొన్‌ నటిస్తున్నారు.

మరాఠా పెష్వా భాజీరావు మస్తానీ మొదటి లుక్‌ పోస్టర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. భాజీరావుగా రణవీర్‌ లుక్‌ అదిరిపోయింది. నున్నని గుండు, లైట్‌గా ఎదిగిన మీసకట్టు, అందుకు తగ్గట్టే కణతపై ఓ పాత గాయం.. గాయానికి సంబంధించిన గీత, మెడలో ముత్యపు దండలు, చెవికి లోలాకులు.. ఈ రూపం చూడగానే రాయల్‌గా కనిపించాడు. అలాగే దీపిక పదుకొన్‌ కిరీట ధారణ చేసి యుద్ధంలో కత్తి తిప్పే కాశీభాయిగా కనిపించింది. బాణం ఎక్కుపెట్టి శత్రువు గుండెల్ని చీల్చేందుకు రెడీ అవుతున్న వీరనారిగా కనిపిస్తోంది. ఇక మస్తానీ సైతం కిరీటధారణతో కనిపించి చీరకట్టులో హుందాగా కనిపించింది. ఫస్ట్‌ లుక్‌ కి వందకి వంద మార్కులు పడ్డాయి. ఈ గురువారమే సినిమా టీజర్‌ని కూడా రిలీజ్‌ చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో..