Begin typing your search above and press return to search.

దిల్‌వాలేపై బాణం వేస్తున్న మస్తానీ

By:  Tupaki Desk   |   15 July 2015 3:33 PM GMT
దిల్‌వాలేపై బాణం వేస్తున్న మస్తానీ
X
మనస్సు దోచుకునే దిల్‌వాలే ఒకవైపు.. బాణాలతో ప్రత్యర్ధులను చంపేసే మస్తానీ బేగం మరో వైపు. అయితే గతంలో ఈ మాస్తానీని మనకు పరిచయం చేసింది ఆ దిల్‌వాలే సాబే. కాని ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఆ దిల్‌వాలే పైనే ఈ మస్తానీ తన అస్త్రాలను ఎక్కుపెడుతోంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి అతిపెద్ద బాలీవుడ్‌ వీకెండ్‌నాడు ఈ హాట్‌ కపుల్‌ కొట్టుకోవడానికి సిద్దపడుతున్నారు.

ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్‌ వంటి సినిమాలతో తెగ రచ్చ చేశారు షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొనె. మధ్యలో చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌తో భారీ హిట్టునే కొట్టారు. అయితే ఈ హ్యాట్రిక్‌ బ్యూటి ఇప్పుడు బాలీవుడ్‌ తెరకు తనను పరిచయం చేసిన షారూఖ్‌తోనే తలపడుతోంది. వచ్చే డిసెంబర్‌ 18న రణవీర్‌ సింగ్‌, దీపిక మెయిన్‌ లీడ్స్‌లో రూపొందుతున్న ''బాజీరావ్‌ మస్తానీ'' విడుదలవుతోంది. సరిగ్గా అదే రోజున రోహిత్‌ షెట్టి తీస్తున్న షారూఖ్‌, కాజల్‌ ఫిలిం ''దిల్‌వాలే'' కూడా రిలీజ్‌కువస్తోంది. ప్రతీసారి పెద్ద స్టార్ల సరసన మసాలా గ్లామర్‌ రోల్స్‌లో మెరిసే దీపిక ఈసారి మాత్రం కత్తియుద్దాలు చేస్తూ బాణాల వర్షం కురిపించే మస్తానీ పాత్రలో అలరిస్తుందట. ఈ రెండు సినిమాలను అందరూ షారూఖ్‌ వర్సెస్‌ దీపిక అన్నట్లే చూస్తున్నారు. అయితే ఇంకా ఈ రెండు సినిమాల్లో ఒక్కదాని ట్రైలర్‌ కూడా రిలీజ్‌ కాలేదు. కనీసం ఒక్కటైనా రిలీజ్‌ అయితే, ఈ సినిమాలు ఎలాగుంటాయో మనం ఊహించుకోవచ్చు.