Begin typing your search above and press return to search.
సన్నీలియోన్ కి బెయిల్ మంజూరు..!
By: Tupaki Desk | 10 Feb 2021 1:15 PM ISTబాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లియోన్ కి బెయిల్ వచ్చింది. ఛీటింగ్ కేసులో ఆమెను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేసింది. సన్నీలియోన్ తనను మోసం చేసిందని కేరళలోని పెరంబపూర్ కు చెందిన ఈవెంట్ మేనేజర్ ఆమెపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2019 వాలెంటైన్స్ డే సందర్భంగా రెండు ఈవెంట్స్ కి అటెండ్ అవుతానని ఒప్పందం కుదుర్చుకుని తన వద్ద రూ.29లక్షలు తీసుకుని ముఖం చాటేసిందని అతను ఆరోపించాడు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారించారు.
అయితే ఈవెంట్ ఆర్గనైజర్ చేసిన ఆరోపణలను సన్నీ లియోన్ ఖండించారు. ప్రోగ్రాం షెడ్యూల్ సరిగా ఏర్పాటు చేయకుండా తనను రెండు సార్లు అనవసరంగా రప్పించారని.. ఆ రెండు సార్లు కూడా ఈవెంట్స్ జరగలేదని.. తనకు రావల్సిన డబ్బు కూడా సకాలంలో చెల్లించలేదని తెలిపింది. ఈ క్రమంలో ఓ షూటింగ్ కోసం తిరువనంతపురం వెళ్లిన సన్నీని కొచ్చి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సన్నీ లియోన్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.