Begin typing your search above and press return to search.
ప్రభాస్ పచ్చబొట్టు అందరికీ కావాలంట
By: Tupaki Desk | 24 July 2015 11:59 AM ISTభారతీయుల జీవితాల్లో సినిమా కూడా ఓ పార్ట్. నటులను దేవుళ్లుగా భావించడంలో మనోళ్లకు మించినోళ్లు ఎక్కడా కనపడరు. సినీతారలు ఏం చేస్తే అదే ట్రెండ్, వాళ్లు ఏం ధరిస్తే అదే ఫ్యాషన్. సినిమాలు చూసి మంచి, చెడూ రెండూ నేర్చేసుకునే బాపతు.. మన దగ్గర బాగా ఎక్కువగానే ఉంటారు. హీరోహీరోయిన్ల మాదిరిగా కనిపించేందుకు తెగ తాపత్రయపడుతుంటారు సినీ వీరాభిమానులు.
సినిమాల నుంచి అన్నిటి కంటే ఎక్కువ నేర్చుకునేది ఫ్యాషన్ నే. హీరో వేసిన డ్రస్, హీరోయిన్ కట్టిన శారీ, యాక్టర్స్ ధరించే సూట్స్, హెయిర్ స్టయిల్స్.. ఒక్కటేంటి అన్నిటినీ అప్పటికప్పుడు ఫాలో అయ్యే జనాలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తారు. ఇప్పుడు బాహుబలి విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే... ఇది మరీ కాల్పనిక చారిత్రక చిత్రం కావడంతో... హీరోహీరోయిన్ల డ్రస్సులు ఫాలో కావడం కష్టం. అందుకే టాటూల మీద పడ్డారు ఫ్యాన్స్.
హీరోయిన్ తమన్నాకి తెలీకుండానే ఆమె చేయి, భుజాలపై టాటూలు వేస్తాడు హీరో ప్రభాస్. సినిమా ఎంత అందంగా ఉంటుందో... ఈ డిజైన్లు కూడా అంతే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతే కాదు... తర్వాత వీరిద్దరి మధ్య వచ్చే 'పచ్చబొట్టేసిన పిల్లగాడా' అనే రొమాంటిక్ డ్యూయెట్ లో వీటిని మరింత బాగా ఎక్స్‌పోజ్ చేశాడు రాజమౌళి. సాధారణంగా టాటూలకు డార్క్ గ్రీన్, బ్లాక్ కలర్స్ ఉపయోగిస్తారు. బాహుబలిలో మాత్రం లావెండర్, పింక్ కలర్స్ తో వేసిన పచ్చబొట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఇంకా చెప్పాలంటే తమన్నా వైట్ టోన్ స్కిన్ పై ఈ పచ్చబొట్లు మరింతగా మెరిసిపోతూ కనిపించాయి. దీంతో ఇప్పుడీ టాటూలకు మాంచి క్రేజ్ పెరిగిపోయింది. అవే టాటూలు, అవే ప్లేస్ లలో, అవే కలర్స్ తో తమకూ వేయాల్సిందిగా ఆర్టిస్టుల దగ్గరకొచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. మొత్తానికి టాటూ ఆర్టిస్టులకూ బిజినెస్ పెంచేశాడు మన దర్శకధీరుడు.