Begin typing your search above and press return to search.

థియేటర్లకు జనాల్ని రప్పించడానికి బాహుబలి దిగిరావాల్సిందే..!

By:  Tupaki Desk   |   7 Nov 2020 11:45 AM IST
థియేటర్లకు జనాల్ని రప్పించడానికి బాహుబలి దిగిరావాల్సిందే..!
X
కరోనా కారణంగా మూతపడిపోయిన థియేటర్స్‌ తెరవాలని గత ఎనిమిది నెలలుగా థియేటర్స్‌ ఓనర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్.. ఇలా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రం అన్‌ లాక్ 5.0 మార్గదర్శకాల ప్రకారం కొన్ని నియమ నిబంధనల ప్రకారం థియేటర్స్, మల్టీప్లెక్స్ ఓపెన్ చేసుకోడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్టోబర్ 15 నుంచే రీ ఓపెన్ చేసుకోమని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడా థియేటర్స్ ఓపెన్ చేయలేదు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో థియేటర్స్‌ రీ ఓపెన్ అయ్యాయి. ఇన్నాళ్లూ థియేటర్స్ ఎప్పుడు తెరవాలనే విషయంలో సందిగ్ధంలో ఉన్న తమిళనాడు ప్రభుత్వం కూడా నవంబర్ 10 నుంచి సినిమాలు ప్రదర్శించడానికి రెడీ అవుతోంది.

అయితే థియేటర్స్ ఓపెన్ చేసినా ఆడియన్స్ ఒకప్పటిలా సినిమాలు చూడటానికి వస్తారా అనేది అందరికీ ఉన్న డౌట్. అందులోనూ థియేటర్స్ లో ప్రదర్శించడానికి కొత్త సినిమాలేవీ యాజమాన్యాల దగ్గర లేవు. ఆల్రెడీ ఓటీటీలలో రిలీజ్ అయిన సినిమాల థియేట్రికల్ రిలీజ్ కి ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో త‌మిళ‌నాడు మరియు మహారాష్ట్ర లలో థియేట‌ర్స్ కు ఆడియెన్స్ ను ర‌ప్పించేందుకు 'బాహుబ‌లి' ఫ్రాంచైజీని ఉప‌యోగిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ 'బాహుబలి - ది బిగినింగ్' ని మహారాష్ట్ర థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. 'బాహుబలి- కన్‌క్లూజన్' ను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నారు. అలానే త‌మిళ‌నాడు థియేటర్స్ లో ర‌జ‌నీకాంత్ సినిమాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన 'బాహుబలి' రెండు పార్ట్స్ వేస్తున్న‌ట్లుగా స‌మాచారం. 'బాహుబలి' సినిమాను చూడటానికి ఆడియన్స్ మళ్లీ థియేటర్స్‌ కు వస్తారని అందరూ ఆశతో ఉన్నారు. మరి 'బాహుబలి' ఏ మేరకు ప్రేక్షకులను రప్పిస్తుందో చూడాలి.