Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బద్రినాథ్ ఇంప్రెస్ చేశాడే

By:  Tupaki Desk   |   2 Feb 2017 9:14 AM GMT
ట్రైలర్ టాక్: బద్రినాథ్ ఇంప్రెస్ చేశాడే
X
బాలీవుడ్ లో తెగ స్పీడ్ మీద ఉన్న యంగ్ బ్యూటీ ఆలియా భట్. వరుసగా సినిమాలు చేసేయడమే కాదు.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో విపరీతంగా అట్రాక్ట్ చేస్తోందీ బ్యూటీ. బద్రీనాథ్ కీ దుల్హనియా అంటూ.. వరుణ్ ధావన్ తో కలిసి చేసిన మూవీకి.. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది.

ట్రైలర్ ప్రారంభం నుంచి.. హీరో హీరోయిన్స్ ఇద్దరి మధ్య కామెడీ.. కెమిస్ట్రీలనే ఎక్కువగా టార్గెట్ చేశాడు దర్శకుడు శశాంక ఖేతాన్. కరణ్ జోహార్ ప్రొడక్షన్ కావడంతో.. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. ప్రేమ గీమా ఏం లేదు అంటూనే.. డైరెక్టుగా పెళ్లి చేసుకోవడమే అంటూ ఆలియాను పడేసేందుకు హీరో ప్రయత్నాలు చేస్తుంటాడు. మొదట తిట్టిపోయడం.. 'సింపుల్ ఇంట్రెస్ట్ కి.. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా' చెప్పు ఆలియా అడగడం లాంటివి బాగా పేలాయి.

ఇక సినిమాకి బ్యాక్ గ్రౌండ్ గా బిగ్ బీ మూవీ హమ్ లోని 'చుమ్మా చుమ్మ దేదే చుమ్మ' ను రీమిక్స్ చేయడం కూడా బాగా కుదిరింది. పనిలో పనిగా హీరోహీరోయిన్ల లిక్ లాక్ కూడా ట్రైలర్ లో జత చేసేశారు. ట్రైలర్ చివర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా కాస్త కష్టంగా ఉంది.. ఓ వారంలో నేర్చుకుని చెబుతా అంటూ వరుణ్ ధావన్ చేసిన కామెడీ కూడా బాగా కుదిరింది. వరుణ్-ఆలియాల్లోని కామెడీ యాంగిల్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. మార్చ్ 10న విడుదల కాబోతోన్న బద్రీనాథ్ కీ దుల్హనియా.. ప్రేక్షకులను మెప్పించేట్లుగానే ఉంది.