Begin typing your search above and press return to search.

జల్సా.. ఖుషి తర్వాత ఇప్పుడు బద్రి

By:  Tupaki Desk   |   6 Jan 2023 11:30 PM
జల్సా.. ఖుషి తర్వాత ఇప్పుడు బద్రి
X
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. మొన్నటి వరకు హీరోల పుట్టిన రోజులు మరియు ముఖ్యమైన రోజుల్లో మాత్రమే వారి యొక్క సూపర్‌ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు రోజుతో సంబంధం లేకుండా వరుసగా స్టార్‌ హీరోల సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. రీ రిలీజ్ లో పవన్ ఫ్యాన్స్ ముందు ఉన్నారు.

ఇప్పటికే జల్సా మరియు ఖుషి సినిమాల యొక్క రీ రిలీజ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేశారు. ఇటీవల రీ రిలీజ్ అయిన ఖుషి సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టి అందరిని ఆశ్చర్యపర్చింది. జల్సా మరియు ఖుషి సినిమాలను మించి వసూళ్లు సాధించేలా ఇప్పుడు బద్రి సినిమా ను రీ రిలీజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బద్రి సినిమాను జనవరి 26వ తారీకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. రీ రిలీజ్ లో బద్రి కూడా సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్‌ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ దశలో ఉంది. మరో వైపు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్ మరియు సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరో వైపు వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ లో కూడా పవన్ నటించేందుకు ఓకే చెప్పాడు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు వీటన్నింటిని పవన్ పూర్తి చేయాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.