Begin typing your search above and press return to search.

తన సినిమా రీమేక్ లోనే నటిస్తున్న తాప్సీ!

By:  Tupaki Desk   |   27 May 2020 7:30 AM
తన సినిమా రీమేక్ లోనే నటిస్తున్న తాప్సీ!
X
తాప్సీ మొదట్లో నటించిన తెలుగు సినిమాలన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే. అయితే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం రూటు మార్చింది. అడపాదడపా కమర్షియల్ సినిమాలు చేసినా ఎక్కువగా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసింది. మంచి విజయాలు సాధిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది. తాజాగా ఈ భామ 'ఎవరు' తమిళ రీమేక్ లో నటించేందుకు పచ్చజెండా ఊపిందట.

అడివి శేష్.. రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎవరు' తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమాను స్పానిష్ ఫిలిం 'ది ఇన్విజిబుల్ గెస్ట్' ఆధారంగా రూపొందించారు. 'ఎవరు' కంటే ముందు ఈ స్పానిష్ సినిమా ఆధారంగా హిందీలో 'బద్లా' అనే సినిమాను రూపొందించారు. అమితాబ్ బచ్చన్.. తో పాటు ఈ సినిమాలో తాప్సీ ఓ కీలక పాత్ర పోషించింది. హిందీలో ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. హిందీలో నటించిన పాత్రలోనే తాప్సీ ఇప్పుడు తమిళ రీమేక్ లో నటించడం విశేషం.

ఈ సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్ గా ఉంటుంది. దీంతో ఏ భాషలోకి రీమేక్ చేసినా అక్కడ విజయం సాధిస్తోంది. ఈ లెక్కన తాప్సీకి తమిళ ప్రేక్షకులు కూడా జేజేలు పలకడం దాదాపుగా ఖాయమే. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయట.