Begin typing your search above and press return to search.

రౌడీ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

By:  Tupaki Desk   |   15 Dec 2020 5:00 AM IST
రౌడీ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!
X
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో 'ఫైటర్' అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. 'వరల్డ్ ఫేమస్‌ లవర్‌' ప్లాప్ తరువాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అదే సమయంలో ఈ సినిమా గురించి రీసెంటుగా వస్తున్న ఈ న్యూస్ వీడీ అభిమానులను కలవరపెడుతోంది.

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు తండ్రిగా యాక్షన్‌ కింగ్ అర్జున్ నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోందట. అర్జున్ క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఏ తెలుగు సినిమా కూడా హిట్ అవ్వలేదు. అర్జున్ నటించిన 'శ్రీఆంజనేయం' 'లై' 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో అర్జున్ టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన సినిమాలు ప్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్ సినీ జనాల్లో ఉంది. ఇప్పుడు ఈ సెంటిమెంటే రౌడీ ఫ్యాన్స్‌ ను భయపెడుతోంది. హిట్‌ కోసం ఎదురు చూస్తున్న విజయ్‌ కి అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్‌ ఎఫెక్ట్ పడుతుందేమో అని భయపడుతున్నారని తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అర్జున్ కి ఉన్న క్రేజ్ యాడ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.