Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. యువ‌హీరోయిన్ పై దుష్ప్ర‌చారం?

By:  Tupaki Desk   |   25 Dec 2022 12:30 AM GMT
#గుస‌గుస‌.. యువ‌హీరోయిన్ పై దుష్ప్ర‌చారం?
X
ఫ‌లానా హీరోయిన్ ఒక్క హిట్టు కొట్ట‌గానే చెట్టెక్కి కూచుంటోంది! అంటూ ఒక ప్ర‌చారం సాగుతుంది. నిజానికి ఇదే ప్ర‌చారం ఆ హీరోయిన్ కంటే ప‌దింత‌లు అధికంగా పారితోషికం అందుకునే హీరోపై అస్స‌లు జ‌ర‌గదు. ఫ‌లానా హీరోయిన్ ఈగో స‌మ‌స్య‌ల‌తో భారీ త‌ప్పిదం చేసింద‌ని త‌న‌వైపు వ‌చ్చిన అవ‌కాశాన్ని తెలివిత‌క్కువ‌త‌నంతో వ‌దులుకుంద‌ని కూడా కొంద‌రు ప్ర‌చారం చేసేస్తుంటారు. నిజానికి తెర‌వెన‌క ఏం జ‌రిగింది? అన్నది పూర్తిగా తెలియ‌కుండానే కేవ‌లం ఒక లైన్ ఒక కోణాన్ని మాత్ర‌మే తెలుసుకుని కొన్ని మీడియాలు అదే ప‌నిగా త‌ప్పుడు ప్ర‌చారం చేసేస్తున్నాయి. దీనిపై చాలా మంది క‌థానాయిక‌లు బ‌హిరంగంగానే వాపోతున్నారు. ఇంట‌ర్వ్యూల్లో ఈ రాత‌ల్ని ఖండిస్తున్నారు.

అప్ప‌ట్లో నిత్యా మీన‌న్ ని ప్ర‌భాస్ గురించి ప్ర‌శ్నించ‌గా.. ఆ హీరో ఎవ‌రో నాకు తెలీదు! అని అమాయ‌కంగా అన్నారు. నిజానికి నిత్యా అప్పుడే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అంత‌గా ప‌రిణ‌తి కూడా చెంద‌ని టీనేజీ న‌టి. కానీ ఆ మాట‌ను హైలైట్ చేస్తూ మీడియా హెడ్డింగులు పెట్ట‌డంతో పెద్ద ర‌చ్చ‌య్యింది. కేవ‌లం మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ గురించి త‌ప్ప అప్ప‌టికి నిత్యాకు ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌పై అవ‌గాహ‌న లేదు.

అప్పుడే అన్నీ నేర్చుకుంటోంది. అప్ప‌టికి ప్ర‌భాస్ బాహుబ‌లి స్టార్ కూడా కాదు. అలాగే ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే స్టార్ డ‌మ్ గురించి.. సంపాద‌న గురించి త‌క్కువ‌గా ఆలోచించే ఏకైక‌ న‌టిగా నిత్యామీన‌న్ ని తెలుగు మీడియా రిక‌గ్నైజ్ చేసింది అప్ప‌టికే. ఆశ‌ప‌డి స్టార్ల స‌ర‌స‌న న‌టించే టైపు అస‌లే కాదు! కానీ ప్ర‌భాస్ విష‌యంలో త‌న కామెంట్ గురించి సాగిన దుష్ప్ర‌చారం అంతా ఇంతా కాదు!!

ఇక‌పోతే ఇటీవ‌ల ఒక యువ‌న‌టిపై అదే ప‌నిగా దుష్ప్ర‌చారం సాగుతోంది. న‌టించిన తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన స‌ద‌రు యంగ్ బ్యూటీ ఆపై భారీగా పారితోషికం పెంచేసింద‌ని ఎవ‌రి మాటా విన‌డం లేద‌ని కొన్ని అవ‌కాశాల్ని మొండి పంతంతో వ‌దులుకుంటోంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ఇప్పుడు ఈగో స‌మ‌స్య వ‌ల్ల స‌ద‌రు బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమా ఆడిష‌న్ కి పిలిచినా హాజ‌రు కాలేద‌ని .. తాను ఇప్ప‌టికే పెద్ద న‌టిని అని బింకానికి పోయింద‌ని కూడా ప్ర‌చార‌మ‌వుతోంది.

కానీ స‌ద‌రు బాలీవుడ్ నిర్మాణ సంస్థ త‌మ కాల్ ని ప‌ట్టించుకోని యువ‌న‌టిని లైట్ తీస్కుంద‌ని కూడా ఈ క‌థ‌నం పేర్కొంది. అంతేకాదు... స‌ద‌రు యువ‌న‌టి ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంద‌ని త‌న నుంచి పెర్ఫామెన్స్ ని ర‌ప్పించేందుకు ద‌ర్శ‌కులు చాలా పాట్లు ప‌డుతున్నార‌ని కూడా క‌థ‌నంలో ఉటంకించి రాసారు. నిజానికి ఇది వ‌న్ సైడ్ స్టోరీగా క‌నిపిస్తోంద‌ని .. స‌ద‌రు యంగ్ బ్యూటీకి ఇత‌ర క‌మిట్ మెంట్ల వ‌ల్ల కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తి బాలీవుడ్ ఆడిష‌న్స్ కి వెళ్ల‌లేక‌పోయింద‌ని ఒక సోర్స్ చెబుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగు మీడియాలో త‌న‌పై సాగుతున్న దుష్ప్ర‌చారాన్ని త‌ట్టుకోలేక మ‌ల‌యాళ సినిమాల‌కు మాత్ర‌మే ఓకే చెబుతోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక సెక్ష‌న్ ప‌ని గ‌ట్టుకుని మ‌రీ త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని ఈ యువ న‌టి స‌న్నిహితుల వ‌ద్ద వాపోయింద‌ని కూడా ఇప్పుడు గుస‌గుస వినిపిస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.