Begin typing your search above and press return to search.
#పాతే ఇప్పుడు కొత్త బెల్ బాటమ్ డేస్ లో బ్యాడ్ గాళ్
By: Tupaki Desk | 4 April 2021 8:00 AM ISTసాహో చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఒకే ఒక్క స్పెషల్ నంబర్ తో ప్రభాస్ అభిమానుల్ని స్పెల్ బౌండ్ చేసేసింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన క్రిష్ దర్శకత్వంలో నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు.
జాకీ ఇటీవల కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉంది. అటు బాలీవుడ్ లో నిరూపించుకుని ఇటు సౌత్ లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇదే అదనుగా జాక్విలిన్ ప్రఖ్యాత బ్రాండ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఆ క్రమంలోనే సోషల్ మీడియా ల్లో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉంది. తాజాగా ఇన్ స్టా వేదిక గా బెల్ బాటమ్ ఫ్యాంట్ ని ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్న ఓ ఫోటోని జాకీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. చూస్తుండగానే బెల్ బాటమ్ రోజుల్లోకి వెళ్లిపోతోంది జాకీ.. పాతే ఇప్పుడు కొత్త! అంటూ అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు.
ఆసక్తికరంగా జాక్విలిన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం బెల్ బాటమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాకీ నటించకపోయినా కానీ ఇప్పుడిలా బెల్ బాటమ్ లో ప్రత్యక్షమై ఆశ్చర్యపరుస్తోంది. ఇక సల్మాన్ తో వరుస సినిమాలకు సిద్ధమవుతున్న జాక్విలిన్.. కిలాడీ అక్షయ్ సరసన రామ్ సేతు అనే క్రేజీ హిస్టారికల్ చిత్రంలో నటిస్తోంది. మొదటి రోజు షూటింగ్ లోనూ జాకీ పాల్గొంది. స్పాట్ నుంచి తన అందమైన క్షణాన్ని కెమెరాలో బంధించి ఆ ఫోటోని షేర్ చేసినందుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అక్షయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
రామ్ సేతు చిత్రీకరణ కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైంది. ఇందులో అక్షయ్ కుమార్ -నుష్రత్ భారుచా .. జాకీ తదితరులు నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక రామ్ సేతులో భాగం కావడం చాలా గౌరవంగా భావిస్తున్నానని జాకీ ఇటీవల వ్యాఖ్యానించారు. అక్షయ్ ఈ చిత్రంలో పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనుండగా జాకీ స్పై తరహా పాత్రలో మెరుపులు మెరిపించనుందని సమాచారం. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అరుణా భాటియా - విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.