Begin typing your search above and press return to search.

యంగ్ హీరోకి బ్యాక్ టు బ్యాక్ మూడు పెద్ద ఆఫ‌ర్లు

By:  Tupaki Desk   |   13 Jun 2021 3:30 PM GMT
యంగ్ హీరోకి బ్యాక్ టు బ్యాక్ మూడు పెద్ద ఆఫ‌ర్లు
X
యంగ్ హీరో నిఖిల్ క‌రోనా సెకెండ్ వేవ్ క‌ష్ట‌కాలంలో సేవ చేస్తూ దాతృ హృద‌యాన్ని చాటుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. స‌మస్య త‌న వ‌ర‌కూ చేరిందంటే సోనూ సూద్ లా నేనున్నాంటూ ముందుకొస్తున్నాడు. ఎలాంటి విరాళాలు సేక‌రించ‌కుండా సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసి బాధితుల‌ను ఆదుకుంటున్నాడు. కొవిడ్ న్యూ వేరియెంట్ తో పాటు ఫంగ‌స్ లాంటివి సోకినా వాటి చికిత్స లోను చొర‌వ చూపిస్తున్నాడు.

నిఖిల్ మంచిత‌నం..సేవాధృక్ఫ‌థం గురించి అభిమానులు ఆస‌క్తిక‌ర పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో నిఖిల్ కు సోష‌ల్ మీడియాలో అనూహ్యంగా ఫాలోయింగ్ పెరిగింది.

మ‌రోవైపు స‌క్సెస్ ఫుల్ హీరోగా అతడికి ఇప్ప‌టికే ప‌లు క్రేజీ ఆఫ‌ర్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం నిఖిల్ కార్తికేయ‌-2.. 18 పేజీస్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ సినిమా అయితే మ‌రొక‌టి జీఏ2 సంస్థ‌లో క్రేజీ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా అల‌రించ‌నుంది.

ప్ర‌స్తుతం చేస్తున్న‌ రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ‌టంతో తాత్క‌లికంగా వీటికి బ్రేక్ ప‌డింది. అయితే ఇవి గాక మ‌రో మూడు సినిమాలకు లైన్ క్లియ‌రైందని తెలుస్తోంది. వాటి వివ‌రాలు ఇంకా రివీల్ కాలేదు గానీ దాదాపు లాక్ అయిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా చూస్తే.. నిఖిల్ కి ఫ్లాపులేవీ లేవు. రీసెంట్ గా ఒక‌ట్రెండు యావ‌రేజ్ లు .. మిగ‌తా వాటిలో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం చేతిలో రిలీజ్ కు రెడీగా ఉన్న ప్రాజెక్ట్ లు గ‌నుక స‌క్సెస్ సాధిస్తే అత‌డు మ‌రో లెవ‌ల్ కి చేర‌తాడు. చేస్తున్న రెండూ క్రేజీ ప్రాజెక్టులే కావ‌డంతో బిగ్ హోప్ తో ఉన్నాడు నిఖిల్.