Begin typing your search above and press return to search.

ఆ విషయంలో బ్యాచిలర్ ఇంకా ఎలిజిబుల్ కాలేదా..??

By:  Tupaki Desk   |   3 March 2021 9:30 AM GMT
ఆ విషయంలో బ్యాచిలర్ ఇంకా ఎలిజిబుల్ కాలేదా..??
X
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే హీరోయిన్. అసలే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు అఖిల్. ఇలాంటి సమయంలో అఖిల్ సరసన పూజాహెగ్డే రొమాన్స్ అనేసరికి సినిమాపై ప్రేక్షకులలో అటెన్షన్ మొదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ మూవీని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ మధ్య రొమాన్స్ అండ్ లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయినట్లు చిత్రబృందం చెబుతోంది. ఇదిలా ఉండగా.. గీతాఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య 100%లవ్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అదే సంస్థ మళ్లీ అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తోంది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది.

నిజానికి సినిమా ప్రారంభంలో కనిపించిన బజ్ ఇప్పుడు కనిపించడం లేదనే చెప్పాలి. అలాగే పోస్టర్స్, సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. సినిమా కూడా జూన్ లో రాబోతుందని ప్రకటించిన గీతాఆర్ట్స్.. ఈ సినిమా గురించి సరిగ్గా ప్రచారం చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సంస్థ నుండి వస్తున్న చావుకబురు చల్లగా సినిమాకు చేస్తున్న హడావిడి ఈ సినిమా విషయంలో కనిపించట్లేదు. చావుకబురు చల్లగా మూవీ రిలీజ్ దగ్గర పడింది. అనుకుంటే జూన్ వరకు బ్యాచిలర్ మూవీని కూడా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అలాంటి ప్రయత్నాలు ఎక్కడా వినిపించడం లేదు. చాలా సమయం ఉందని అనుకుంటే మాత్రం ఈరోజుల్లో సినిమా ఓపెనింగ్స్ బట్టే డిసైడ్ అయిపోతున్నాయి. హిట్టా ఫట్టా అనేవి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో పాటు ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే బాగుంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను బన్నీవాసు, వాసువర్మలు నిర్మిస్తుండగా.. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.