Begin typing your search above and press return to search.

బ్యాచిలర్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఓటీటీ దిగ్గజం..?

By:  Tupaki Desk   |   18 March 2021 2:30 AM GMT
బ్యాచిలర్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఓటీటీ దిగ్గజం..?
X
అక్కినేని అఖిల్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్''. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన ఈ చిత్రాన్ని జూన్‌ 19న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. అయితే బ్యాచిలర్ డిజిటల్ రైట్స్ మంచి రేట్ కే అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మిగతా ఓటీటీలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అఖిల్ సినిమా నెట్ ఫ్లిక్స్ కి అమ్ముడుపోవడం గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలన్నీ వారం నుంచి రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీని వల్ల థియేటర్ రన్ కోల్పోయే అవకాశం ఉంది. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం కొన్ని రోజులు థియేటర్స్ లో రన్ అయిన తర్వాతే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సూపర్ హిట్ అయిన 'ఉప్పెన' సినిమా విషయంలో నెట్ ఫ్లిక్స్ ఇలానే వ్యవహరించింది.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు తీసుకోవడం వల్ల.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు థియేటర్స్ లో ఎక్కువ రోజులు సందడి చేసే అవకాశం లభించినట్లేనని చెప్పవచ్చు. అందులోనూ జూన్ 19న సోలోగా వస్తుండటంతో కలెక్షన్స్ పరంగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.