Begin typing your search above and press return to search.

వీడియో : 'వి' మూవీ నుంచి 'బేబీ టచ్ మీ నౌ' సాంగ్...!

By:  Tupaki Desk   |   2 Sept 2020 2:00 PM IST
వీడియో : వి మూవీ నుంచి బేబీ టచ్ మీ నౌ సాంగ్...!
X
నేచురల్ స్టార్ నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ''వి''. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్‌ - హ‌ర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన 'వి' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి - నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో 'వి' చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన యాక్షన్ ప్యాకెడ్ ''వి'' ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో పాటు 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని 'బేబీ టచ్ మీ నౌ' అనే మరో వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

కాగా 'బేబీ టచ్ మీ నౌ' సాంగ్ సుధీర్ బాబు - నివేదా థామస్ లపై చిత్రీకరించారు. 'మజా మజా మైకంలో ఆన్ ది ఫ్లోర్.. మళ్ళీ మళ్ళీ ట్రిప్ అయిపోరో..' అంటూ సాగిన ఈ సాంగ్ పార్టీ నైట్ థీమ్ తో డిజైన్ చేయబడింది. ఇంద్రగంటి మోహనకృష్ణ 'జెంటిల్ మెన్' సినిమాలోని 'సాటర్ డే నైట్ ఫీవర్' సాంగ్ ని పోలి ఉంది. నివేదా థామస్ క్యూట్ ఎక్సప్రెషన్స్ మరియు సుధీర్ బాబు డ్యాన్స్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. దీనికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇక కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించగా సింగర్ శర్వి యాదవ్ ఆలపించారు. సినిమాలో ఈ సాంగ్ సినిమాలో ఏ సందర్భంలో వస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.