Begin typing your search above and press return to search.
హార్ట్ బ్రేకింగ్ పాటతో అంచనాలు పెంచేశారుగా...!
By: Tupaki Desk | 18 May 2023 12:23 AM ISTవిజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించాడు. మిడిల్ క్లాస్ మెలొడీస్ తో నటుడిగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బేబీ అంటూ కొత్త ప్రేమ కథతో మన ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశారు. స్కూలు నుంచి మొదలైన ప్రేమ కథగా చూపించారు. మూవీ విడుదలకు దగ్గరౌతుండటంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రేమిస్తున్నా అంటూ సాగే పాటలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కనపడుతోంది. హీరోలు ఇద్దరూ హీరోయిన్ కోసం పాట పాడుతున్నట్లుగా ఉంది. మరి వారి ఇద్దరిలో నిజమైన ప్రేమ ఎవరిది, ఆ ప్రేమ ఎవరికి దక్కింది అనే విషయం పాటతో మరింత ఆసక్తి పెంచుతోంది.
ఇక పాటలో హీరోయిన్ రెండు భిన్న కోణాల్లో కనపడుతోంది. గోడ మీద ఆమె చిత్రాన్ని పెయింట్ వేసినట్లుగా అంది. ఆ పెయింట్ లోనూ ఆమె కంట కన్నీళ్లు ఉన్నాయి. ఇక ఇద్దరు హీరోలతోనూ ఆమె ప్రేమగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. ఈ పాటను రష్మిక మందన్నా విడుదల చేయడం విశేషం.
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరో కాగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. మరో ముఖ్యపాత్రలో విరాజ్ అశ్విన్ నటించారు. కాగా చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనగానే మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కి హీరోయిన్ గా ఇది తొలి సినిమా. గతంలో యూట్యూబ్ లో డ్యాన్స్ వీడియోలు, పలు వెబ్ సిరీస్ లలో నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు ఆమె హీరోయిన్ గా తొలి మెట్టు ఎక్కుతోంది. మరి ఈ సినిమా ఆమెకు ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా జులై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.