Begin typing your search above and press return to search.

పిచ్చెక్కించేస్తున్న ఆ సినిమా టీజర్

By:  Tupaki Desk   |   10 Jun 2017 10:02 AM GMT
పిచ్చెక్కించేస్తున్న ఆ సినిమా టీజర్
X
బాలీవుడ్ గ్రేటెస్ట్ యాక్టర్లుగా నిన్నటి తరంలో ఓంపురి.. నసీరుద్దీన్ షా.. నానా పటేకర్ లాంటి వాళ్లు పేరు తెచ్చుకుంటే.. ఈ తరంలో అంతటి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. అతడి టాలెంట్ ఏంటో చెప్పడానికి ఒక్క ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ సిరీస్ చాలు. అందులో తన యాక్టింగ్ స్కిల్స్ తో మతి పోగొట్టేశాడు నవాజ్. ఆ తర్వాత మరెన్నో సినిమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. విలన్.. క్యారెక్టర్ రోల్స్ తోనే కాదు.. సోలో హీరోగా చేసిన సినిమాల్లోనూ నవాజుద్దీన్ అదరగొట్టేశాడు. గత ఏడాది ‘రామన్ రాఘవ్ 2.0’లో అతనెలా విజృంభించాడో తెలిసిందే. తాజాగా నవాజ్ ఏంటో చూపించే మరో సినిమా బాలీవుడ్లో రెడీ అయింది. అదే.. ‘బాబు మషాయ్ బందూక్ బాజ్’.

బాలీవుడ్ అంతా నిన్నట్నుంచి ‘బాబు మషాయ్ బందూక్ బాజ్’ టీజర్ గురించే చర్చించుకుంటోంది. నిమిషం పైగా నిడివి ఉన్న ఈ చిత్ర టీజర్ చూస్తే చిత్రమైన అనుభూతి కలగడం ఖాయం. నవాజుద్దీన్ ‘బాబు’ అనే కాంట్రాక్ట్ కిల్లర్ క్యారెక్టర్ చేస్తున్నాడిందులో. టీజర్లో అతడి పరిచయమే వావ్ అనిపిస్తుంది. ‘హమ్ ఔట్ సోర్సింగ్ కర్తే హై.. యమ్ రాజ్ కే లియే’ (నేను యముడి కోసం ఔట్ సోర్సింగ్ చేస్తుంటా) అనే డైలాగ్ డైలాగ్ చెబుతూ సింపుల్ గా ఎదుటి వ్యక్తిని గన్నుతో కాల్చేసి తన క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు నవాజ్. ఇక ఆ తర్వాత అతడి విన్యాసాలు మరిన్ని చూపించారు. వేశ్యల దగ్గర వెళ్లి వాళ్ల దగ్గర వేసే చిల్లర వేషాల్ని ‘రా’గా చూపించారు. టీజర్లో బోలెడన్ని షాట్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. ఇందులో దివ్య దత్తా.. బిడితా బేగ్.. శ్రద్ధా దాస్.. మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కుషన్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/