Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బ‌డా హీరోలు `బాబు` ట్యాగ్ వ‌దులుకోలేరా?

By:  Tupaki Desk   |   29 Jun 2021 6:00 PM IST
టాలీవుడ్ బ‌డా హీరోలు `బాబు` ట్యాగ్ వ‌దులుకోలేరా?
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో చాలామంది హీరోల‌కు పేరు చివ‌రిలో `బాబు` అనే ట్యాగ్ ఎందుకు ఉంటుంది? బాబు గోరూ అని పిల‌వాలా? ఇదే ప్ర‌శ్న అడిగితే ర‌క్త చ‌రిత్ర ఇంట‌ర్వ్యూలో రామ్ గోపాల్ వ‌ర్మ ఏమ‌ని అన్నారంటే.. బాబు అనేది ఇండ‌స్ట్రీలో చాలా సంవ‌త్స‌రాలుగా ఎగ్జిస్ట్ అయిన ట్యాగ్. దానిని ద‌ర్శ‌కనిర్మాత‌లు సెట్లో ఇత‌రులు హీరోని పిలిచేందుకు సౌక‌ర్యం కోసం యాడ‌ప్ చేసిన‌ది. అంతేకానీ స‌ద‌రు హీరోల‌పై ప్రేమ‌తో కానీ లేదా ఇంకేదైనా ఆప్యాయ‌త‌ను కురిపించేందుకు కానీ కానేకాదు! అని సెల‌విచ్చారు.

కొంద‌రు హీరోల‌కు బాబు అనేది నామ‌క‌ర‌ణంలోనే ఉంటే చాలామందికి నామ‌క‌ర‌ణంలో లేదు. అయినా కానీ స‌ద‌రు హీరోలంద‌రినీ పిలవాలంటే బాబు త‌ప్ప‌నిస‌రి. అది సులువుగా గౌర‌వంగా పిలిచేందుకు ఉప‌నామం అని భావించ‌వ‌చ్చు.

ఇక ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖ‌ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన కుర్ర హీరోల‌కి బాబు అని ఎండ్ నేమ్ ఉంటుంది.. కానీ ఇటీవ‌ల త‌మ ఫ్యామిలీ కొత్త‌ హీరోల‌కు దానిని యాడ్ చేయ‌డం లేదట‌. ఈ బాబు ట్యాగ్ ఆ బాబుతోనే లాస్ట్ అని గుస‌గుస స్ప్రెడ్ అవుతోంది. అన్న‌ట్టు నాగ‌బాబు లోనూ బాబు ఉంది. కానీ `బాబు`ను తీసేసి `నాగ` అని పిల‌వ‌డం కొంచెం ఇబ్బందే. అయినా బాబు అనే పిలుపు సౌకర్యం సాన్నిహిత్యం కోసం.. అదేమీ బిరుదు కాదు కాబ‌ట్టి నో ఇష్యూ!