Begin typing your search above and press return to search.

సాయితేజ్ ప్రమాదంపై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   12 Sept 2021 1:00 PM IST
సాయితేజ్ ప్రమాదంపై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు
X
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నడుపుతూ సాయిధరమ్ స్కిడ్ అయ్యి కిందపడ్డాడు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సాయిధరమ్ తేజ్ ప్రమాదం విషయమై నటుడు బాబు మోహన్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడి మరణాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. బాబు మోహన్ కుమారుడు కూడా ఇలానే స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించారు. యాక్సిడెంట్ లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. సరదా కోసం ప్రాణాలతో ఎవరూ చెలగాటం ఆడొద్దని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

ప్రమాదంలో మరణించిరు వాపు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలి అని బాబు మోహన్ వాపోయారు. సాయితేజ్ హెల్మెట్ పెట్టుకొని మంచి పనిచేశాడని మోహన్ బాబు తెలిపారు. ‘కొందరు హెల్మెట్ పుట్టుకోవడాన్ని నామోషీలా ఫీలవుతారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ థ్రిల్ ఫీల్ అయ్యి యాక్సిడెంట్ కాగానే చతికిలపడుతారు. లేకపోతే అతన్ని నమ్ముకున్న వాళ్లు చీకట్లోకి వెళ్లిపోతారు. దీనికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ తండ్రి తన కళ్లముందు కుమారుడిని కోల్పోతే తండ్రి శరీరం కాలిపోయే వరకు ఆ దు:ఖం ఉంటుంది. కడుపుతీపితో వచ్చే ఆ బాధను ఎవరూ తగ్గించలేరు. దయచేసి యూత్ తమ కుటుంబాన్ని గుర్తు చేసుకొని బైక్ నడపాలి’ అంటూ బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు.