Begin typing your search above and press return to search.

కౌశల్‌ ఆర్మీపై బాబు గోగినేని లాజికల్‌ అనుమానం

By:  Tupaki Desk   |   28 Aug 2018 5:30 PM GMT
కౌశల్‌ ఆర్మీపై బాబు గోగినేని లాజికల్‌ అనుమానం
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయిన రెండు వారాల నుండి సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పదం కౌశల్‌ ఆర్మీ. బిగ్‌ బాస్‌ 2 కంటెస్టెంట్‌ అయిన కౌశల్‌ వ్యక్తిత్వం నచ్చిన ఎంతో మంది కౌశల్‌ ఆర్మీలో జాయిన్‌ అవుతున్నారు. ఒక చిన్న గ్రూప్‌ గా ప్రారంభం అయిన కౌశల్‌ ఆర్మీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే రేంజ్‌ కు చేరింది. దాదాపు 25 వేల మంది సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీని ఫాలో అవుతున్నట్లుగా వెబ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతటి క్రేజ్‌ ఉండబట్టే ఎప్పుడు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయినా కౌశల్‌ సునాయాసంగా సేవ్‌ అవుతున్నాడు. కౌశల్‌ ను ఎవరు ఇంట్లో టార్గెట్‌ చేసినా కూడా ఆయన అభిమానులు వారిని టార్గెట్‌ చేస్తూ ఎలిమినేట్‌ చేస్తున్నారు.

కౌశల్‌ తో పెట్టుకుంటే కౌశల్‌ ఆర్మీ ఊరుకోదు అనేది ఒకటి పడిపోయింది. కౌశల్‌ ఆర్మీ గురించి తాజాగా బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన బాబు గోగినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఆర్మీలో చేరాలనుకుంటే బౌర్డర్‌ కు వెళ్లాలి కాని, ఇలా ఒక వ్యక్తికి ఆర్మీ అంటూ పెట్టుకుని, సోషల్‌ మీడియాలో హడావుడి చేయవద్దు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కౌశల్‌ ఆర్మీ అనేది ఒక బూటకం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు.

బిగ్‌ బాస్‌ ప్రారంభం అయిన రెండు వారాల్లో కౌశల్‌ ఆర్మీ ప్రారంభం అయ్యింది. అంతలోనే అంతగా ఫాలోయింగ్‌ వచ్చింది అంటే ఆ ఆర్మీ వెనుక ఏదో ఉందని, ముందే ప్రీ ప్లాన్డ్‌ గా దీన్ని ప్రారంభించారేమో అంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశాడు. కాస్త డీటైల్డ్‌ గా పరిశోదిస్తే కౌశల్‌ ఆర్మీ బండారం మొత్తం బయటకు వస్తుందని బాబు గోగినేని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం బాబు గోగినేని అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. కౌశల్‌ ఆర్మీ అనేది జన్యూన్‌ అంటూ కౌశల్‌ అభిమానులు అంటున్నారు. కౌశల్‌ ఆర్మీని చూస్తుంటే కౌశల్‌ ఫైనల్‌ విన్నర్‌ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు వారాలు మాత్రమే బిగ్‌ బాస్‌ షో మిగిలి ఉంది. ఫైనల్‌ విన్నర్‌ ఎవరో మూడు వారాల్లో తేలిపోనుంది.