Begin typing your search above and press return to search.

తిక్క హీరోకి లక్కు కలిసొస్తోందా

By:  Tupaki Desk   |   12 Aug 2016 3:30 PM GMT
తిక్క హీరోకి లక్కు కలిసొస్తోందా
X
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'తిక్క' మూవీ రేపు రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్ తో ఆకట్టుకోగా.. ట్రైలర్ ను తిక్కతిక్కగా కట్ చేయడంతో., చాలామందిలో గందరగోళంలో పడిపోయారు. పైగా ప్రమోషన్స్ కాస్త స్లోగా ఉండడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొనేందుకు టైమ్ పట్టింది. కానీ సినిమా రిలీజ్ దగ్గర పడుతోందనగా.. ఇప్పుడు తిక్క మీద హోప్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

సాంగ్ ప్రోమోలతో పాటు.. పలు డైలాగ్ టీజర్లు.. తిక్కపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇలాంటి టైమ్.. ఇవాళ రిలీజ్ అయిన వెంకటేష్- మారుతిల మూవీ బాబు బంగారానికి యావరేజ్ మార్కులే పడ్డం కూడా తిక్కకి కలిసొచ్చే అంశమే. బంగారం కనుక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే.. ఆ మేరకు తిక్కకు బాగానే దెబ్బ తగిలేది. పైగా ఈ మూవీ నిర్మాతలు బాగా కాన్ఫిడెంట్ గా శనివారం రిలీజ్ చేస్తున్నారు. అయినా సరే.. సోమవారం కూడా సెలవు ఉండడంతో.. తిక్క కరక్టుగా కొడితే.. సాయిధరమ్ కు హ్యాట్రిక్ పడినట్లే అని చెప్పుకోవచ్చు.

అయినా.. సుప్రీమ్ కి యావరేజ్ టాక్ వచ్చిన టైమ్ లో.. సూపర్ హిట్ టాక్ వచ్చిన 24తో పోటీ పడి కూడా.. పాతిక కోట్లు రాబట్టేశాడు తేజు. ఇప్పుడు కూడా ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. మళ్లీ తన రికార్డులు తానే బద్దలుకొట్టేసుకోవడం ఖాయమే.