Begin typing your search above and press return to search.

బాహుబలిని అడ్డుకోగలవా బాబూ?

By:  Tupaki Desk   |   2 May 2017 6:45 AM GMT
బాహుబలిని అడ్డుకోగలవా బాబూ?
X
బాహుబలి ది కంక్లూజన్.. టాలీవుడ్ కే కాదు.. దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ సెన్సేషనల్ మూవీ. ఓవర్సీస్ లో బాలీవుడ్ మూవీస్ కి ధీటుగా వసూళ్లను సాధించడం.. అది కూడా పరిమిత సంఖ్యలో స్క్రీన్స్ లోనే కావడం మరీ విశేషం. వీకెండ్ ముగిశాక కూడా.. బాహుబలి2 సెన్సేషన్స్ కంటిన్యూ అవుతుందని.. రెండో వారం కూడా ఈ సినిమా వసూళ్లను ఆపడం సాధ్యం కాదని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

ఏ భాషలోనూ బాహుబలి2కి పోటీగా సినిమా రిలీజ్ చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. అయితే.. టాలీవుడ్ లో మాత్రం బాహుబలి2కి పోటీగా ఓ సినిమా వస్తోంది. బాబు బాగా బిజీ అంటూ శ్రీనివాస్ అవసరాల చేసిన అడల్ట్ కంటెంట్ మూవీని మే 5న రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిన్న సినిమాకి బాహుబలి2 జోరుకు బ్రేక్ వేయగలిగే సత్తా లేదనే చెప్పాలి. అయితే.. ఆ మూవీ క్రేజ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా ఏ థియేటర్లోనూ బాహుబలి తప్ప వేరే సినిమా లేకపోవడం కలిసొచ్చే ఛాన్స్ ఉంది.

అయితే.. ఇది ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా కాకపోవడమే అసలు సిసలైన నెగిటివ్ పాయింట్. యూత్ ఆడియన్స్ కు తప్ప.. మరెవ్వరూ థియేటర్లకు రానక్కర్లేదు అన్న స్థాయిలో టీజర్ కట్ చేశారు. ఇప్పుడు బాహుబలి2 ఇంతగా కుమ్మేస్తోందంటే అందుకు కారణం ఫ్యామిలీస్. మరి యూత్ కోసమే తీసిన బాబు బాగా బిజీ.. బాహుబలి జోరును ఏ కొంచెమైనా తగ్గించగలదో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/