Begin typing your search above and press return to search.

బిజీ బాబును ఎట్టకేలకు పాస్ చేశారు

By:  Tupaki Desk   |   14 April 2017 11:38 AM GMT
బిజీ బాబును ఎట్టకేలకు పాస్ చేశారు
X
సెన్సార్ బోర్డు. ఈ మధ్యన కబడ్డీ ఆడటంలో వీరు నిష్ణాతులు అయిపోయారు. బూతులు నుండి బూతు సీన్ల వరకు.. ముద్దుల సీన్ల లెంగ్త నుండి హీరోయిన్ నాభి చూపించే షాట్ నిడివి వరకు.. అబ్బో వీళ్ళు కంట్రోల్ చేయని అంశమే లేదు. అయితే ఇప్పుడు ఇదే అంశంపై మేకర్లు కూడా గట్టిగానే పోరాడుతున్నారు. మాకు సర్టిఫికేట్ ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు.

తెలుగు బ్యూటి సుప్రియ అయాసోల.. ''బాబు బాగా బిజీ'' సినిమాలో ఒక ఆంటీ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమా హీరో శ్రీనివాస్ అవసరాల.. ఆంటీతో ఒక ఎఫైర్ పెట్టుకుంటాడు. వారిరువురి మధ్యనా కొన్ని సెక్స్ సీన్లే ఉన్నాయిలే. వాటికి అభ్యంతరం తెలుపుతూ.. ''బాబు బాగా బిజీ'' సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. 'యు/ఎ' సర్టిఫికేట్ కావాలంటూ అప్పుడు రివైజింగ్ కమిటీ డోర్లు కొట్టారు నిర్మాతలు. చివరికి ''ఎ'' సర్టిఫికేట్ తో సినిమాను ఈరోజే పాస్ చేసి సెన్సార్ సర్టిఫికేట్ చేతిలో పెట్టారు.

బాలీవుడ్ హంటర్ సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న సినిమా ఈ ''బాబు బాగా బిజీ''.. ఒక మాంచి కళాత్మక సినిమా అనే చెప్పాలి. మే 5న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను.. నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు రూపొందించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/