Begin typing your search above and press return to search.

బిజీనే కానీ.. వల్గర్ గా ఉండని బాబు

By:  Tupaki Desk   |   16 Jan 2017 1:10 PM GMT
బిజీనే కానీ.. వల్గర్ గా ఉండని బాబు
X
బాలీవుడ్ మూవీ హంటర్.. తెలుగులో బాబు బాగా బిజీ అనే టైటిల్ పై రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ అవసరాల లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. మూవీ ప్రారంభించినప్పటి నుంచి.. ఈ చిత్రం అడల్ట్ కామెడీ అనే ప్రచారం జరుగుతోంది.

అయితే.. తమ సినిమాలో సున్నితత్వం ఉంటుంది కానీ.. అడల్ట్ కామెడీ కాదంటున్నాడు దర్శకుడు నవీన్ మేడారం. 'హంటర్ రీమేక్ ను అంతా అడల్ట్ కామెడీ అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. లోతుగా చూస్తే.. ఇది ఓ ముగ్గురు స్నేహితుల కథ. సెక్స్ అడిక్ట్ గా మారిన ఓ వ్యక్తికి సంబంధించిన ఎమోషనల్ స్టోరీ ఇది. ఈరోటిక్ కంటెంట్ ను దాటి ఆలోచిస్తే.. స్నేహానికి ఇచ్చే విలువ ఈ మూవీలో కనిపిస్తుంది' అని చెప్పాడు దర్శకుడు.

'బాబు బాగా బిజీలో ఇంటిమేట్ సీన్స్ ఉంటాయనే మాట వాస్తవమే. అయితే.. వాటిని ఆకర్షణీయంగా చూపించడానికి.. బూతులా చూపించడానికి మధ్య సన్నని గీత ఉంటుంది. సినిమా మొత్తంలో ఎక్కడా ఆ గీత దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నాం' అని చెప్పాడు దర్శకుడు. బాబు బాగా బిజీలో శ్రీనివాస్ అవసరాలకు జోడీగా మిస్తీ చక్రవర్తి.. తేజస్వి మదివాడ.. సుప్రియ.. శ్రీముఖిలు నటిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/