Begin typing your search above and press return to search.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటున్న బాబా మాస్టర్‌

By:  Tupaki Desk   |   8 Sept 2022 9:00 AM IST
నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటున్న బాబా మాస్టర్‌
X
ఈ నెల 16న విడుదల అవుతున్న “నేను మీకు బాగా కావాల్సినవాడిని”.చిత్రంలో నటించడం నా అదృష్టం గా భావిస్తున్నాను..స్టార్ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఇంటర్వ్యూ

కిరణ్ అబ్బవరం హీరోగా సంజ‌న ఆనంద్‌.. సిధ్ధార్ద్ మీన‌న్‌.. ఎస్ వి కృష్ణారెడ్డి.. బాబా బాస్క‌ర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'. ఈ సినిమాకి ఎస్.ఆర్ కళ్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. కోడి రామ‌కృష్ణ కుమార్తె దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలువబోతుంది.

‘SR కళ్యాణ మండపం’ తర్వాత అదే కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన బాబా భాస్కర్ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ... నాకు సినిమానే జీవితం.. సినిమానే నా డ్రీమ్. ఈ సినిమాలో  కిరణ్ అబ్బవరం తో చేయడం చాలా సులువుగా ఉంది. తను అందరి తో బాగా కలిసి పోతాడు. చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె కు కథ  విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమాలో నటిస్తూనే ఒక సాంగ్ కు కొరియోగ్రఫీ చేశాను. ఆ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది

గతంలో నేను ఒక సినిమాకి డైరెక్షన్ చేశాను. మళ్లీ దర్శకత్వం చేయాలని కథలు కూడా ఎంపిక చేసుకున్నా కూడా టైమ్ సెట్ అవ్వక పోవడం వల్ల ఇన్నాళ్లు చేయలేదు. కొరియోగ్రాఫర్ గా రాష్ట్ర జాతీయ  పురస్కారాలు అందుకోవాలని  నా కోరిక  దానికోసం చాలా కష్టపడ్డా.. ఇకపై కూడా కష్టపడతాను అన్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.