Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ ఎలిమినేష‌న్లో సూప‌ర్ ట్విస్ట్‌!

By:  Tupaki Desk   |   10 Sep 2019 4:50 AM GMT
బిగ్‌ బాస్ ఎలిమినేష‌న్లో సూప‌ర్ ట్విస్ట్‌!
X
బిగ్ బాస్ లో అసలు మజా మొదలైంది. ఆదివారం ఎపిసోడ్ లో అలీ ఎలిమినేట్ కావడంతో ఇంటిలో 11 మంది మిగిలారు. ఈ 11 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ సోమవారం ఎపిసోడ్ లో కొనసాగింది. ఇప్ప‌టికే షో విజ‌య‌వంతంగా 50 రోజులు కంప్లీట్ చేసుకోవ‌డంతో ఇక నుంచి ఏం చేసిన అది ఫైనల్ మీద ప్రభావం చూపుతుందని చెప్పి బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాడు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ బాబా భాస్కర్ మినహా మిగతా 10 మంది సభ్యులని రెండు గ్రూపులుగా విభజించారు.

శ్రీముఖి - హిమజ - రవి - శివజ్యోతి - మహేశ్ ఒక గ్రూపు...వరుణ్ - రాహుల్ - పునర్నవి - వితిక - శిల్పా చక్రవర్తి లని ఒక గ్రూపుగా పెట్టాడు. ఈ రెండు గ్రూపు సభ్యులు తమ గ్రూపులోని సభ్యులని కాకుండా అపోజిట్ గ్రూపులోని ఇద్దరు సభ్యుల ఫోటోలని మంటల్లో వేసి వారిని ఎందుకు ఎలిమినేషన్ కు నామినేట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలని కోరారు. దీంతో మొదట రవి...రాహుల్-శిల్పాలని నామినేట్ చేస్తూ కారణాలు చెప్పాడు. ఆ తర్వాత పునర్నవి.. మహేష్-శ్రీముఖి - శివజ్యోతి.. పునర్నవి-శిల్ప - శిల్ప చక్రవర్తి.. జ్యోతి-హిమజ - శ్రీముఖి.. పునర్నవి-శిల్ప - వితిక.. రవి-మహేశ్ - హిమజ.. శిల్ప-వితిక - వరుణ్.. మహేష్-హిమజ - మహేష్.. పునర్నవి-వరుణ్ - రాహుల్.. శ్రీముఖి-రవిలని నామినేట్ చేశారు.

అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన శిల్ప - పునర్నవి - మహేశ్ - హిమజ - రవి - శ్రీముఖిలు ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్లు చెప్పారు. ఇక కెప్టెన్ బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఓ బంపర్ అవకాశం ఇచ్చాడు. ఎలిమినేషన్లో ఉన్న ఒకరిని సేఫ్ చేయొచ్చని చెప్పాడు. దీంతో కాసేపు ఆలోచించుకుని నిజాయితీగా గేమ్ ఆడుతున్నాడు అని చెబుతూ..రవిని సేఫ్ చేస్తున్నట్లు బాబా చెప్పాడు. ఇక రవి సేఫ్ అయినట్లు ప్రకటించిన బిగ్ బాస్... ఈ వారం ఇంటి నుంచి బయటకెళ్ళేందుకు నామినేట్ అయిన సభ్యులు శ్రీముఖి - హిమజ - మహేశ్ - పునర్నవి - శిల్పలు అని ప్రకటించాడు. ఇక బాబా నిర్ణయాన్ని ఇంటి సభ్యులు అందరూ స్వాగతించారు.