Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఫన్నీ టాస్క్: ఏ‌బి‌సి‌డిలు రావన్న బాబా….

By:  Tupaki Desk   |   14 Sept 2019 10:19 AM IST
బిగ్ బాస్ ఫన్నీ టాస్క్: ఏ‌బి‌సి‌డిలు రావన్న బాబా….
X
ఈ వారం మొత్తం సీరియస్ టాస్క్ లు ఇచ్చి ఇంటి సభ్యులతో ఓ ఆట ఆడుకున్న బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ లో ఫన్నీ టాస్క్ లు ఇచ్చారు. ఎపిసోడ్ ప్రారంభమవ్వడమే మొన్న టాస్క్ లో తల మీద గుడ్డు పగలగొట్టడం వల్ల శ్రీముఖి ఫీల్ అయిందని...సారీ చెప్పినా సరిగా మాట్లాడటం లేదని హిమజ..శివజ్యోతితో తనని బాధని చెప్పుకుంది. వీరి ఎపిసోడ్ అవ్వగానే బిగ్ బాస్ ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ లో భాగంగా ఇంటి సభ్యులకు ‘సీక్రెట్ ఎనలైజ్’ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఇంటి సభ్యులని కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారు. అక్కడ వారికి ఫన్నీ టాస్క్ ఇస్తారు. ఆ తర్వాత వారు బయటకొచ్చాక లోపల జరిగింది చెబుతారు.

ఇక అది నిజమో కాదో మిగతా సభ్యులు ఊహించి చెప్పాలి. ఎక్కువ కరెక్ట్ చెబితే రాత్రి అద్భుతమైన డిన్నర్ దక్కుతుంది. ఈ టాస్క్ లో భాగంగా మొదట బాబా భాస్కర్ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు. అక్కడ యాప్పీ ఫిజ్ డ్రింక్ ని తాగమని బాబాకి చెప్పి ఆ తర్వాత... 1 నుండి 100 వరకూ అంకెలు లెక్కపెట్టమన్నారు. పూర్తైన తరువాత 100 నుండి 1కి వెనక్కి తిరిగి లెక్కపెట్టమనడంతో బాబాకి చుక్కలు కనిపించాయి.

అనంతరం Z నుండి A వరకూ వెనక్కి లెటర్స్ చెప్పమనడంతో నాకు A నుండి Z వరకూ తెలియదు.. Z నుండి A వరకూ ఎలా చెప్తా బిగ్ బాస్ నాకు రాదు అనేశారు. అయితే ఓసారి ట్రై చేస్తా అని చెప్పి మధ్యలో కొన్ని లెటర్లు ఎగరగొట్టేశారు. తాను ఎనిమిదో తరగతి ఫెయిల్ ఏబీసీడీలు రావు అని చెప్పేశారు. దీంతో బిగ్ బాస్ మీరు ఇంటి సభ్యులతో మాట్లాడి వెంటనే ఏబీసీడీలు నేర్చుకోండి అని సలహా ఇచ్చి... ఇక మీరు వెళ్లొచ్చని ఆదేశించారు. ఇక బయటకొచ్చిన బాబా లోపల జరిగింది చెప్పారు...ఆయన చెప్పింది నిజమని మెజారిటీ సభ్యులు బిగ్ బాస్ కు చెప్పగా...కరెక్ట్ గానే చెప్పారని ప్రకటించారు.