Begin typing your search above and press return to search.

కత్తికి తేరుకోలేని షాకిచ్చిన నిత్యా

By:  Tupaki Desk   |   12 Sep 2016 5:30 PM GMT
కత్తికి తేరుకోలేని షాకిచ్చిన నిత్యా
X
'లైఫ్‌ ఆఫ్‌ పై' వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన నిత్యా మెహ్రా.. డెబ్యూ సినిమాతో రచ్చలేపుతుంది అనుకుంటే.. అక్కడ కేవలం కత్రినా కైఫ్‌ బికినీ తప్పిస్తే ఇంకోటి జనాలకు కనిపించలేదు. పోనివ్ ఆ బికినీ అయినా ''బార్ బార్ దేఖో'' సినిమాను సేవ్ చేస్తుందా అంటే.. అంత సీన్ లేదులే అనేశారు ఆడియన్స్.

కొత్తరకం స్ర్కీన్ ప్లే.. నాన్ లీనియర్ నేరేటివ్.. ఇదో సంచలనాత్మక స్ర్కిప్ట్ అంటూ కొందరు సెలబ్రిటీలు సినిమాను ఏ రేంజులో ఎత్తేసినా కూడా.. కామన్ ఆడియన్స్ కు మాత్రం అవన్నీ ఎక్కలేదు. అసలు సినిమా నెరెటివ్ డెడ్ స్లోగా నడుస్తుంటే.. ఎవరైనా మాత్రం ఎలా రియాక్ట్ అవుతారు? మొన్న శుక్రవారం రిలీజైన 'బార్ బార్ దేఖో' సినిమా ఇప్పుడు మూడు రోజుల్లో కేవలం 21.16 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే ఈ వసూళ్ళు సోమవారం నుండి ఇంకా తగ్గాయి. అంటే సినిమా ఫ్లాపు దిశగా ప్రయాణిస్తోందని అనమాట. దాదాపు 70 కోట్లు బడ్జెట్ తో (మేకింగ్ + ప్రమోషన్స్) ఈ సినిమాను రూపొందిస్తే.. ఇలా తొలి వీకెండే చతికిలపడటం కాస్త చేదైనా విషయమే.

ఆ లెక్కన చూస్తే.. కత్తిలాంటి అందాల కత్రినా కైఫ్‌ కు దర్శకురాలు నిత్యా మెహ్రా భారీ షాకే ఇచ్చింది.