Begin typing your search above and press return to search.

బార్ బార్ 'బ్రా' సీన్ లో ఆమె లేదట

By:  Tupaki Desk   |   2 Sep 2016 9:30 AM GMT
బార్ బార్ బ్రా సీన్ లో ఆమె లేదట
X
సిద్ధార్ధ మల్హోత్రా-కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ బార్ బార్ దేఖో.. సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయనే న్యూస్ హల్ చల్ చేశాయి. బ్రా ను చూపించే సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ చెప్పిందని.. అలాగే సవితా భాబీ రిఫరెన్స్ ను కూడా తీసివేయాలని చెప్పారని వార్తలొచ్చాయి.

ఇప్పుడీ వార్తలపై డైరెక్టర్ నిత్యా మెహ్రా స్పందించింది.'అసలు ఈ సినిమా కత్రినా కైఫ్ బ్రాతో నటించిందే లేదు.. అలాంటి సన్నివేశమే లేదు. అలాంటప్పుడు ఆ సీన్ ని సెన్సార్ వాళ్లు కట్ చేసే ఛాన్స్ అంతకంటే లేదు. అలాగే మా సినిమాలో ఎక్కడా అసభ్యకరమైన దృశ్యాలు ఉండవు. ఇప్పటికే సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది' అని చెప్పింది నిత్యా మెహ్రా. సెన్సార్ తో తమకు విబేధాలు ఏర్పడ్డాయనే వాదనను ఈ లేడీ డైరెక్టర్ కొట్టిపడేసింది.

బార్ బార్ దేఖో సినిమాలో నుంచి ఒక్క సీన్ కూడా కట్ కాలేదని.. కథలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం రాలేదని హీరో సిద్ధార్ధ కూడా చెప్పేశాడు. మొత్తం మీద ఎలాంటి అభ్యంతరాలు కోతలు లేకుండానే కత్రినా అందాలను చూసే ఛాన్స్ ప్రేక్షకులకు ఉందన్న మాట.