Begin typing your search above and press return to search.

నిజమా.. బాహుబలి 2 అంత చిన్నదా?

By:  Tupaki Desk   |   21 Aug 2016 4:12 AM GMT
నిజమా.. బాహుబలి 2 అంత చిన్నదా?
X
బాహుబలి సినిమా అనుకుని.. సీన్ బై సీన్ రాసుకుంటూ వచ్చినపుడు నాలుగు గంటలపాటు వచ్చిందని.. అందుకే దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాల్సి వచ్చిందని.. గతంలోనే చెప్పేశాడు దర్శకధీరుడు రాజమౌళి. మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ రెండున్నర గంటల నిడివి ఉంటుంది. అంటే మిగిలిన సినిమా రెండు గంటలు కూడా ఉండదన్న మాట.

ఇదంతా బాహుబలి ఆ రేంజ్ లో హిట్ కాకమునుపు కథ అనుకున్నారంతా. మొదటి భాగం సాధించిన విజయం చూశాక.. రెండో భాగం బాహుబలి ది కంక్లూజన్ లో కొత్త చేరికలతో మరింత క్రేజ్ తెచ్చి పెట్టేలా మార్పులు చేర్పులు చేశారనే టాక్ వినిపించింది. కానీ రాజమౌళి మాత్రం ముందు తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం తప్ప.. ఒక్క సీన్ కూడా అదనంగా తీయడం లేదట. అందుకే బాహుబలి ది కంక్లూజన్ రన్ టైం 1 గంటా 45 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ఇదే పెద్ద షాకింగ్ న్యూస్ ఇప్పుడు.

తెలుగు సినిమాలు కనీసం 2 గంటల 15నిమిషాలు ఉంటున్నాయి. భారీ కాన్వాస్ ఉన్న చిత్రాలు ఇంకా ఎక్కువసేపే ఉంటున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదట. గంటా 45 నిమిషాల్లోనే జెట్ స్పీడ్ లో సినిమా నడిపించేయబోతున్నాడని అంటున్నారు. ఇంత క్రిస్ప్ గా అంత సినిమా చెప్పేసే సాహసాన్ని.. జక్కన్న ఈజీగానే హ్యండిల్ చేసేస్తాడు లెండి.