Begin typing your search above and press return to search.
మంచుకొండల్లో బాహుబలి
By: Tupaki Desk | 10 Dec 2015 3:15 PM ISTబాహుబలి యూనిట్ ఇప్పుడేం చేస్తోంది ? షూటింగ్ ఎంతవరకూ వచ్చింది.. మొదలుపెట్టేశారా.. ఇలాంటి క్వశ్చన్స్ చాలానే ఉంటాయ్ కానీ.. ఆన్సర్స్ దొరకడం కష్టం. సాధారణంగా జక్కన్న నోరువిప్పితేనే దీనికి సమాధానం లభించే అవకాశం ఉంటుంది. కానీ.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కొన్ని సంగతులు చెబుతున్నాడు. బాహబలి యూనిట్ ఇప్పుడు బల్గేరియాలో ఉంది. ఇక్కడంతా పూర్తిగా మంచు వర్షాలు కురుస్తుండడంతో అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వీలు కుదిరినప్పుడల్లా షూటింగ్ నిర్వహిస్తున్నారు.
బాహుబలి ది బిగినింగ్ లో మంచుకొండల్లో తమన్నా ఎపిసోడ్ మనం ఇంతకు ముందే చూశాం. ఇప్పుడు కంటిన్యూషన్ సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. షూటింగ్ సంబంధించిన డీటైల్స్ ఏవీ బైటకు రాకుండా.. బాహుబలి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు రాజమౌళి. ఈసారి మాత్రం కాస్తంత అవకాశం ఇచ్చినట్లున్నాడు. అందుకే సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. కొన్ని పిక్స్ షేర్ చేశాడు. ఈమొత్తం ఫోటోల్లో బాహుబలి అని కనిపించే క్లాప్ బోర్డ్ తప్ప.. మిగతావన్నీ మంచు తప్ప మరేం కనిపించడం లేదు. ఒక్క క్లాప్ బోర్డ్ ని చూపించి.. ఏదో జరుగుతోందనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో మాత్రం జక్కన్న అండ్ టీం బాగానే సక్సెస్ అవుతున్నారు.
అయితే.. బాహుబలి ది కంక్లూజన్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగానే జరిగిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఒక్క యాక్టర్ కూడా లేకుండా.. ఇలా బాహుబలి షూటింగ్ సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయని చెప్పుకుంటున్నారు.