Begin typing your search above and press return to search.
బాహుబలికి బూస్ట్ ఇస్తున్నారుగా...
By: Tupaki Desk | 11 July 2015 9:43 PM ISTఇప్పటివరకు బాహుబలిలో లోపాలు ఏమున్నాయ్ అని వెతికినవారే కాని.. ఈ సినిమాలో మనకు కొత్తగా ఏం కనిపిస్తున్నాయ్ అని చూస్తున్నవారు మన తెలుగు క్రిటిక్స్‌లో చాలా తక్కువైపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎండింగ్‌లో ఎప్పటిలాగా మేకింగ్ వీడియోను కాని, లేకపోతే ఏదైనా స్పెషల్ సాంగ్‌ను కాని చూపించనేలేదని పాపం రాజమౌళి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రిలీజ్ రోజున ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇకపోతే ఇప్పుడు బాహుబలికి బూస్ట్ ఇవ్వడం అంటే ఏంటో చూద్దాం పదండి.
ఏమీ లేదండీ.. బాహుబలి సినిమాకు కొత్త ఎనర్జీని ఇస్తున్నారు. అసలు రెండోపార్టుకు సంబంధించి చాలా సీన్లు ఇప్పటికే తీసి ఉంచేశారు. సో, ఆ సీన్లను కొన్నింటిని కలిపి ఒక ఐదు నిమిషాల టీజర్ తయారు చేసి.. దానిని బాహుబలి సినిమా చివర్లో కలుపుతున్నారట. ఆల్రెడీ డిజిటిల్ రిలేలో సినిమాను చూపిస్తున్న ధియేటర్లకు ఈ కొత్త ఫుటేజ్‌ను జోడించేశారు. మిగిలిన ధియేటర్స్‌కు కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో కొత్త టీజర్‌ను కలిపేస్తారట. ఈ ఫుటేజ్ కేవలం ధియేటర్స్‌తో సినిమాలు చూసేవారికేనా లేకపోతే దానిని మామూలు ప్రేక్షకుల కోసం ఇంటర్నెట్‌లో కూడా వదులుతారా అనే విషయం ఇంకా తెలియదు మరి. లెటజ్ సీ.