Begin typing your search above and press return to search.
బాహుబలి.. మనోభావాలు దెబ్బతిన్నాయి
By: Tupaki Desk | 8 July 2015 3:34 PM ISTఏ మాట.. ఏ సన్నివేశం.. ఎవరి మనోభావాల్ని దెబ్బ తీస్తుందో తెలియదు. అందుకే సినిమాలు తీసేటపుడు చాలా జాగ్త్రతగా ఉండాలి. చిన్న చిన్న అంశాలు కూడా వివాదాస్పదం అయిపోతున్నాయి ఈ రోజుల్లో. బాహుబలి సినిమాకు సంబంధించి కూడా ఇప్పుడో వివాదం మొదలైంది. ఈ సినిమాలో మాల కులస్థులను అవమానపరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయంటూ ఆ కులానికి చెందిన నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సన్నివేశాల్ని, మాటల్ని తక్షణ తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ ఛైర్మన్ దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆ దృశ్యాలను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.
యూట్యూబ్‌లో మాలలు కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్‌ను ఇప్పటికే పోలీసులకు అందజేశామని.. నిర్మాతలపై ఫిర్యాదు కూడా చేశామని దీపక్ చెప్పారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా ఇప్పటిదాకా విడుదలైన బాహుబలి రెండు ట్రైలర్లలోనూ కులాల ప్రస్తావనైతే ఎక్కడా లేదు. ఏ షాట్ కూడా అలాంటి ఉద్దేశంతో కనిపించలేదు. మరి మాలల్ని కించపరిచే అంశాలు ఏమున్నాయన్నది తెలియడం లేదు. మీడియాతో మాట్లాడుతున్నపుడు ఫలానా చోట అని ప్రస్తావన ఏదీ తేలేదు జేఏసీ నాయకులు. మరి వివాదం దేనిమీదో! ఇంతకుముందు రాజమౌళి తీసిన 'మగధీర'కు కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. ఐతే అది విడుదల తర్వాత. బాహుబలికి మాత్రం విడుదలకు ముందే వివాదం మొదలైంది.