Begin typing your search above and press return to search.

రాజమౌళి చరిత్రను రాసే డేట్‌ వచ్చింది

By:  Tupaki Desk   |   28 Jun 2016 9:30 AM GMT
రాజమౌళి చరిత్రను రాసే డేట్‌ వచ్చింది
X
ఇండియాలో కేవలం 2000 స్క్రీన్స్ లో మాత్రమే విడుదలైన ''బాహుబలిః ది బిగినింగ్‌''.. చైనాలో మాత్రం ప్రకంపనాలు సృష్టిస్తోంది. అక్కడి డిస్ర్టిబ్యూటర్ల కాన్ఫిడెన్స్ ను చూస్తుంటే మనకు మతిపోవాల్సిందే. అందుకే వారు ఏకంగా 6500 స్ర్కీన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. మ్యాండరిన్ చైనీస్ బాషలో విడుదలవుతున్న ఈ సినిమాతో రాజమౌళి చరిత్రను తిరగేయవచ్చు. ఎందుకంటే..

ఇప్పటివరకు చైనాలో అతి పెద్ద సక్సెస్ కొట్టిన సినిమా ''పీకె'' ఒక్కటే. అయితే ఆ తరువాత చైనా అంతటా రిలీజయ్యే కంటెంట్‌ ఉన్నటువంటి సినిమా ఒక్కటి కూడా కనిపించలేదట. అందుకే వారు ఏ ఇండియన్ సినిమాను డబ్బింగ్‌ చేసి గ్రాండ్‌ గా రిలీజ్ చేయలేదు. ఇక బాహుబలిని మాత్రం జూలై 22న దేశమంతటా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా అక్కడి ఆడియన్స్ కు నచ్చేసి హిట్టు కొడితే మాత్రం.. కలక్షన్ల పరంగా కూడా సంచలనాలే జరుగుతాయి. ఈరోజు నుండే చైనాలో 22న జూలై డేటుతో ప్రమోషన్లను మొదలయ్యాయ్. దాదాపు 20 రోజులు ప్రచారాలతో ఊదరగొట్టేసి మనోళ్ళు సినిమాను రిలీజ్‌ చేస్తారు కాబోలు.

ఒకవేళ చైనాలో బాహుబలి పెద్ద హిట్టయితే మాత్రం.. రాజమౌళి చరిత్రను సువర్ణాక్షరాలతో రాసినట్లే. లెటజ్ సీ.