Begin typing your search above and press return to search.

బాగ్ధాద్‌ గజదొంగకైనా కష్టమే

By:  Tupaki Desk   |   27 July 2015 10:17 AM IST
బాగ్ధాద్‌ గజదొంగకైనా కష్టమే
X
ప్రభాస్‌ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 400కోట్ల వసూళ్ల క్లబ్‌ లో చేరుతోంది. ఈ శుభతరుణంలో ఈ రికార్డుల గురించి ప్రపంచమంతా చర్చిస్తోంది. ఇది కనీవినీ ఎరుగని అసాధారణ విజయం. సంచలనాలకే సంచలనం. అయితే ఈ రికార్డుల్ని కొట్టే దమ్మున్న సినిమా టాలీవుడ్‌ లో వస్తుందా? ధీరాధి ధీరులుగా పేరు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ హీరోల్లో ఎవరైనా దీన్ని బీట్‌ చేస్తారా? స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి రంగంలోకి దిగితే ఇది సాధ్యమవుతుందా? ఇలాంటి ప్రశ్నలెన్నో పుట్టుకొస్తున్నాయి.

అయితే వీటన్నిటికీ ఒకటే సమాధానం. బాహుబలి రికార్డుల్ని కొట్టడం ఎవరి తరమూ కాదు. ఆ జోనర్‌ లో వేరే ఎవరూ ప్రయోగం చేయలేరు. కాబట్టి అది అంత ఈజీ కానేకాదు. ఇప్పటికిప్పుడు చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓ రొటీన్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. బాహుబలి జోనర్‌ తో ఏమాత్రం సంబంధం లేదు. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయితే ఓ 60కోట్ల వరకూ వసూలు చేయగలదు. మెగాస్టార్‌ ఇందులో ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారని హైప్‌ చేస్తే మరో 10-15కోట్లు పెరిగినా 75-80కోట్ల లోపే వసూలు చేయగలదు. ఇక పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌ సింగ్‌ 2 వచ్చినా ఇంతకంటే రికార్డులు తిరగరాసేదేమీ ఉండదు. బాహుబలి జోనర్‌ తో వేరే ఏ ఇతర సినిమాని పోల్చడానికే లేదు.

ఒకవేళ మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'బాగ్ధాద్‌ గజదొంగ'ని ఇప్పుడు మళ్లీ తెరకెక్కించే సాహసం చేస్తే .. ఇప్పుడున్న సాంకేతికతను ఉపయోగించి విజువల్‌ ఎఫెక్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఏదైనా అద్భుతాలు సృష్టిస్తే .. అవకాశం ఉంటుందేమో! యూనివర్శల్‌ కాన్సెప్టు, విఎఫ్‌ ఎక్స్‌ సినిమా స్థాయిని నిర్ణయిస్తాయి. వెయిట్‌ అండ్‌ సీ.