Begin typing your search above and press return to search.

బాహబులి రెండో పెళ్లి చేసుకుంటాడా??

By:  Tupaki Desk   |   22 Jan 2016 1:00 PM IST
బాహబులి రెండో పెళ్లి చేసుకుంటాడా??
X
బాహుబలికి వధువు కావాలి అంటూ ఇప్పటికే రానా ఒక యాడ్‌ ను రిలీజ్‌ చేశాడు. ఏదో ప్రభాస్‌ కోసం పిల్లను వెతుకున్నా అని పెదనాన్న రెబెల్‌ స్టార్‌ కృష్ణం రాజు చెప్పగానే.. బాహుబలి కి వధువు కావాలి అంటూ కామెడీగా యాడ్‌ ఇచ్చాడు రానా. బాగానే ఉంది. కాని డైరెక్టుగా ప్రభాస్ పేరు రాయకుండా బాహుబలి అని ఇచ్చాడు చూడండి.. అందులోనే అసలు పంచ్‌ ఉంది.

రానా ఛమత్కారం ఎంత ఆకట్టుకున్నా కూడా.. కాస్త లోతుగా ఆలోచిస్తే మాత్రం ఈ జోక్‌ పెద్దగా వర్కవుట్‌ కావట్లేదు. ఎందుకంటే.. తండ్రి బాహుబలికి ఆల్రెడీ దేవసేన రాణి అనే లవర్‌ ఉంది. ఆమె అతడి వైఫ్‌ అవునా కాదా అనేది బాహుబలి 2 చూస్తే తెలుస్తుంది. ఇకపోతే చిన్న బాహుబలికి ఆల్రెడీ అవంతిక అనే ప్రిన్ సెస్‌ పై మనస్సయ్యింది. మాంచి పాటేసుకున్నారు కూడా. అలాంటప్పుడు ఇప్పుడు బాహుబలికి వధువు కావాలంటే.. పెద్దాయనకైనా.. చిన్నాయనకైనా.. రెండో భార్యను వెతుకుతున్నట్లే కదా. అంటే బాహుబలి వంటి హానెస్ట్‌ రాజు రెండో పెళ్ళి చేసుకుంటాడా?

బాహుబలి పేరుతో ప్రభాస్‌ మీద చేసిన కామెడీ వర్కవుట్‌ అయ్యుంటుంది కాని.. బాహుబలి పేరుతో బాహుబలి మీదనే కామెడీ చేస్తే మాత్రం వర్కవుట్‌ అవ్వదు గురూ. జనాలకు బాగా నచ్చేసిన క్యారెక్టర్‌ కదా.. అందుకే రెండో వైఫ్‌ అంటే ఎవ్వరూ సింక్‌ అవ్వట్లేదు.