Begin typing your search above and press return to search.
ఏమని వర్ణించాలి బాహుబలీ..
By: Tupaki Desk | 19 July 2015 12:36 PM ISTఫస్ట్ వీకెండ్‌లో బాహుబలి ప్రభంజనం ఏ స్థాయిలో సాగిందో చూశాం. బ్లాక్ లో ఐదొందలు పెట్టినా టికెట్ దొరకని పరిస్థితి. సోమవారం నుంచి కొంచెం పరిస్థితి మారింది. చాలాచోట్ల హౌస్ ఫుల్స్ కు ఢోకా లేదు కానీ.. మరీ టికెట్ల కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి కనిపించలేదు. ఆన్ లైన్లో, థియేటర్ దగ్గర టికెట్లకు కొంచెం ఈజీగానే దొరికాయి. ఐతే ఇదంతా శుక్రవారం వరకే. మళ్లీ శని, ఆదివారాల్లో కథ మళ్లీ మొదటికి వచ్చింది. శుక్రవారానికే టికెట్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఆన్ లైన్లో టికెట్ బుక్ చేద్దామని చూస్తే అక్కడక్కడా టికెట్లు ఉన్నట్లే చూపిస్తున్నాయి కానీ.. క్లిక్ చేస్తే సోల్డ్ ఔట్ అనో, వేరే కేటగిరీలో ట్రే చేయమనో రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ టికెట్లు అందుబాటులో ఉన్నా.. అవి ముందు వరసల్లో ఒకటీ అరా మాత్రమే.
ఫస్ట్ వీకెండ్లో సినిమా చూడని వాళ్లంతా ఈ వీకెండుకి టికెట్లు బుక్ చేసుకుంటే.. అప్పుడు సినిమా చూసిన వాళ్లు ఆ గోలలో సినిమాను ఆస్వాదించలేకపోయామంటూ ఇంకోసారి థియేటర్ల బాట పట్టారు. దీంతో రెండో వీకెండ్ కూడా హౌస్ ఫుల్‌తో నడుస్తున్న అరుదైన సినిమాగా ‘బాహుబలి’ ఘనత వహించింది. అత్తారింటికి దారేది కూడా బ్లాక్ బస్టరే హిట్టే కానీ.. అప్పట్లో ఈ పరిస్థితి లేదు. మగధీరకు కూడా రెండో వారం కూడా బాగానే సందడి ఉంది కానీ.. మరీ ఈ స్థాయిలో మాత్రం కాదు. మొత్తానికి బాహుబలి మీద జనాల్లో ఉన్న క్రేజును వర్ణించడం మాటల్లో సాధ్యం కాదు. రెండో వీకెండ్లో కూడా భారీగా కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. 300 కోట్ల క్లబ్ గురించి సోమవారానికి వార్తలు వినబోతున్నామన్నమాటే.