Begin typing your search above and press return to search.

బాహుబలి బ్యానర్ నుంచి వెబ్ సిరీస్

By:  Tupaki Desk   |   30 Jun 2018 5:17 AM GMT
బాహుబలి బ్యానర్ నుంచి వెబ్ సిరీస్
X
అప్పటివరకు మర్యాదరామన్న - వేదం లాంటి మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించినా ఆర్కా మీడియా శోబు యార్ల గడ్డ - ప్రసాద్ దేవినేని బాహుబలి లాంటి బారి సినిమాను నిర్మిస్తారు అని ఎవరు ఊహించలేకపోయారు. ఏ మాత్రం అనుమానం లేకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సినిమాను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాశారు. ఏళ్ల తరబడి ఉన్న ప్రొడక్షన్ సంస్థలు తెచ్చుకొని గుర్తింపును ఆర్కా అతి తక్కువ కాలంలో అందుకుంది.

ఇకపోతే బాహుబలి తరువాత ఆ సంస్థ నుంచి ఎలాంటి చిత్రం వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించడానికి ప్లాన్ చేశారు. కథానాయకుడిగా శర్వానంద్ అని కూడా టాక్ వచ్చింది. కానీ కొన్ని రోజుల తరువాత ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేకపోవడంతో అందరూ మర్చిపోయారు. ఇక రీసెంట్ గా స్వర్ణఖడ్గం పేరుతో ఒక సీరియల్ ను స్టార్ట్ చేశారు. బాహుబలి స్టయిల్లో చేసిన ఆ సీరియల్ ఈటివిలో శుక్రవారం నుంచి ప్రసారమవుతోంది.

ఇక బాహుబలి ఫ్రీక్వెల్ కథతో వెబ్ సిరీస్ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. శివగామి క్యారెక్టర్ తో ప్రధానంగా సాగె ఆ కథను మూడు భాషల్లో నిర్మించనున్నారు. ఇక దర్శకులను కూడా ముగ్గురిని సెట్ చేశారు. అందులో ప్రస్థానం దర్శకుడు దేవకట్టా కూడా ఉన్నాడు. ఇక మరో బాలీవుడ్ దర్శకుడితో పాటు తెలుగు నుంచే ఇంకో దర్శకుడిని ఫిక్స్ చేసుకున్నారట శోబు యార్లగడ్డ. పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ మరో రెండు మూడు నెలల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ కానుంది.