Begin typing your search above and press return to search.

బాహుబలి టీం గిమ్మిక్కు చూశారా?

By:  Tupaki Desk   |   12 May 2017 5:12 AM GMT
బాహుబలి టీం గిమ్మిక్కు చూశారా?
X
బాహుబలి మొదలైనపుడు ఒక సినిమానే. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు కూడా ఒక సినిమా అన్నట్లే ప్రచారం జరిగింది. దాన్ని రెండు భాగాలు చేయాలన్న ఆలోచనపై మీడియాకు సమాచారం ఇచ్చింది 2014 మధ్యలో. షూటింగ్ జరుగుతున్నపుడు రష్ చూసుకుంటే నిడివి పెరిగిపోతున్నట్లు గమనించి.. సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచన తెరమీదికి వచ్చినట్లుగా చెప్పారు దర్శక నిర్మాతలు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ‘బాహుబలి’ షూటింగ్ ఆరంభమవ్వడానికంటే ముందే.. స్క్రిప్టు రెడీ అయినపుడే దీన్ని రెండు భాగాలుగా తీయాలని అనుకున్నట్లు ఆయన చెప్పడం విశేషం.

మరి ముందే ఆ ఆలోచన ఉన్నపుడు అంత కాలం పాటు ఎందుకు విషయాన్ని దాచారు? ముందు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చి.. జనాల్లో క్యూరియాసిటీ పెంచాక.. రెండు భాగాలుగా సినిమా రాబోతున్నట్లు ప్రకటించారన్నమాట. ఆరంభంలోనే విషయం చెబితే.. స్పందన మరో రకంగా ఉండొచ్చు. మీడియాలో కూడా దీని గురించి వ్యతిరేక వార్తలు రావచ్చు. నిజానికి స్క్రిప్టు దశలోనే ఏ సన్నివేశం ఎంత నిడివి వస్తుందన్నది దర్శకుడికి క్లియర్ ఐడియా ఉంటుంది. రాజమౌళి లాంటి దర్శకుడికైతే ఈ క్లారిటీ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇంత భారీ ప్రాజెక్టు చేస్తున్నపుడు.. అంత ఖర్చు పెడుతున్నపుడు.. షూటింగ్ సగం అయ్యాక కానీ నిడివి ఎక్కువైపోతోందని.. సినిమాను రెండు భాగాలు చేయక తప్పదని తెలియదంటే నమ్మలేం. ఇదంతా బాహుబలి టీం మార్కెటింగ్ గిమ్మిక్కుల్లో భాగమే. అప్పటికి ఈ లాజిక్కులేమీ ఆలోచించకుండా బాహుబలి టీం చెప్పిందంతా నమ్మిన మీడియా వాళ్లు.. జనాలే ఫూల్స్ అన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/