Begin typing your search above and press return to search.

పోస్టర్‌ అనేది ఫేస్‌ ఆఫ్‌ మూవీ!!!

By:  Tupaki Desk   |   26 July 2015 1:57 PM GMT
పోస్టర్‌ అనేది ఫేస్‌ ఆఫ్‌ మూవీ!!!
X
పోస్టర్‌ ప్రభావం మనసుపై అంతా ఇంతా కాదు. ఆ పోస్టర్‌ లో కనిపించే హీరో లుక్‌ కచ్ఛితంగా యూత్‌ మస్తిష్కంపై బలంగా పనిచేస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. అప్పట్లో యశ్‌ చోప్రా నిర్మించిన దీవార్‌ పోస్టర్‌ పై హీరో, విలన్‌ ఫోటోల్ని అద్భుతంగా పెయింటింగ్‌ చేయించి వేశారు. ఆ పెయింటింగ్‌ ప్రభావం అసాధారణంగా పడిందని చెబుతుంటారు. మనసును ప్రభావితం చేస్తే పోస్టర్‌ సక్సెసయినట్టే.

రాజేష్‌ ఖన్నా ఆరాధన చిత్రం పోస్టర్‌ వేసినప్పుడు అందులో ముఖాకృతి డిజైన్‌ పై డిష్కసన్‌ సాగింది. ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఈ పోస్టర్‌ ని తన కుంచెతో తీర్చిదిద్దారు. అలాగే షోలే పోస్టర్‌ పై గబ్బర్‌ ఇమేజ్‌ అసాధారణంగా కనిపించడానికి కారణం ఆ పోస్టర్‌ ని దిద్దిన కుంచె ప్రభావమే. నర్గీస్‌ దత్‌, రాజ్‌కుమార్‌ జంటగా నటించిన 'బర్సాత్‌' పోస్టర్‌ పై ఆర్‌.కె.స్టూడియో లోగో డిజైన్‌ చేసిన తీరు అంతే ప్రభావం చూపించింది. స్వదేశ్‌, లగాన్‌, చక్‌ దే ఇండియా వంటి సినిమాల పోస్టర్లు యువతరంపై అంతే ప్రభావం చూపించాయి.

లేటెస్టుగా బాహుబలి పోస్టర్‌ ని 30మంది ఎంతో శ్రమించి తయారు చేశారన్న వార్త వైరల్‌ లా అన్నిచోట్లా పాకింది. మలయాళ నిర్మాత 51,598.21 చదరపు అడుగుల పోస్టర్‌ ని డిజైన్‌ చేయించారు.. అన్నది వినడానికే ఆసక్తి కలిగించింది. దీనికోసం 30మంది శ్రమించారా అన్న ప్రశ్న తలెత్తింది. అందుకే పోస్టర్‌ డిజైన్‌ అనేది ఫేస్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ అండ్‌ మూవీ అని కూడా చెబుతుంటారు. అది సంగతి.