Begin typing your search above and press return to search.
మలయాళీలు లొల్లు పెడుతున్నరు!
By: Tupaki Desk | 11 July 2015 1:00 AM ISTబాహుబలి చిత్రం ప్రపంచమంతా రికార్డులు తిరగరాస్తోంది. అమెరికా, నార్త్ అమెరికాలో రికార్డులే రికార్డులు. గల్ఫ్‌లోనూ భారీ వసూళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా మలయాళ రిలీజ్ మాత్రం చిక్కుల్లో పడిందని చెబుతున్నారు. పొరుగు సినిమాలు భారీగా రిలీజ్ చేస్తే అది లోకల్ సినిమాలకు చిక్కులు తెచ్చిపెడుతుందన్న భయంతో స్థానిక ఎగ్జిబిటర్లు లొల్లు పెట్టేస్తున్నారు.
అప్పట్లో ఐ విషయంలో ఇదే జరిగింది. శంకర్ దర్శకత్వం వహించిన ఐ 200 పైగా థియేటర్లలో రిలీజై మలయాళీలకు చుక్కలు చూపించింది. ఐ మలయాళీల సొమ్ముల్ని ఓ లెవల్‌లో లాక్కుపోయింది. ఆ కలెక్షన్లు చూసి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు వస్తున్న బాహుబలి కూడా మరోసారి అలాంటి పలితాన్నే రిపీట్ చేస్తుందని భయపడి చస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారు. మొదటి రోజు కేవలం 50 థియేటర్లలో మాత్రమే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఎగ్జిబిటర్ల సంఘంతో చర్చలు సాగుతున్నాయి. స్ట్రయిక్ జరగకుండా నిలువరించి మరో 100 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చర్చలు సాగిస్తున్నారు. బాహుబలి ఎప్పుడు రిలీజైనా అక్కడ లోకల్ సినిమాని మింగేయడం ఖాయం. అందుకే ఈ గూడు పుటానీ.