Begin typing your search above and press return to search.
ఒరేయ్ రెండు టిక్కెట్లు రా..!!
By: Tupaki Desk | 10 July 2015 10:18 PM ISTబాహుబలి టిక్కెట్ల విషయంలో బోలెడంత కామెడీ నడుస్తోంది. ఒక్కొక్క చోటా ఒక్కో రకం కామెడీ. కొందరైతే చికెన్ దుకాణాల్లో చికెన్ ముక్కలు కొంటే బాహుబలి టిక్కెట్టు ఫ్రీ అంటూ ఆఫర్లు పెట్టేశారు. ఆన్‌లైన్‌లోనూ ఈ సినిమాకి సంబంధించి కామెడీ సాగుతోంది. అందుకు ఓ నిలువెత్తు సాక్ష్యాన్ని రాజమౌళి స్వయంగా ముందుంచాడు.
ఛత్రపతి సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశం ఉంటుంది. అందులో ప్రభాస్-శేఖర్ మధ్యలో పీక్స్‌లో ఉండే సన్నివేశం ఒకటి ఉంది. సరిగ్గా ఆ ఫోటోల్ని కాప్చుర్ చేసి బాహుబలి ఫ్యాన్ ఎవరో ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్టు తయారు చేశారు. ''రేయ్ ప్లీజ్ రా.. రెండు టిక్కెట్లురా''.. అని శేఖర్ ''గాళ్ ఫ్రెండ్‌ని తీసుకెళ్తానని మాటిచ్చానురా''.. అని ప్రభాస్‌ని అడుగుతుంటే.. ''లెవ్వు.. ఒక్కటి కూడా లేదు..'' అని ప్రభాస్ వేలెత్తి చూపిస్తున్న తీరు బోలెడంత ఫన్ క్రియేట్ చేస్తోంది.
ఫోటోషాప్‌లో డిజైన్ చేసిన ఈ కామిక్ స్ట్రిప్ సరిగ్గా ప్రస్తుత సిట్యుయేషన్‌కి మ్యాచ్ అయ్యింది. చివరికి జక్కన్న సినిమాల్లోని సీన్లే ఇప్పుడు బాహుబలి ప్రచారానికి కలిసొచ్చాయన్నమాట. ఇది ఛత్రపతి సినిమాలోని చాలు డైలాగ్ సీన్. ఇక ఈ స్ట్రిప్‌ను స్వయంగా రాజమౌళే షేర్ చేశాడబ్బా!!